నడిరోడ్డుపై నాలుగు సింహాలు.. డిస్టర్బ్ చేస్తే మటాష్!

బిజీగా ఉన్న రోడ్డు మీదకి నాలుగు సింహాలు వస్తే ఎలా ఉంటుంది. గుండెలో దడ పుడుతుంది. గుండె గట్టిదైతే ప్రాణం ఉంటుంది. లేదంటే పైప్రాణాలు పైనే పోతాయి మరి. అలాంటి అడవిని పాలించే నాలుగు మృగరాజులు రోడ్డుపై తారసపడ్డాయి.

  • Published By: sreehari ,Published On : January 12, 2019 / 06:09 AM IST
నడిరోడ్డుపై నాలుగు సింహాలు.. డిస్టర్బ్ చేస్తే మటాష్!

Updated On : January 12, 2019 / 6:09 AM IST

బిజీగా ఉన్న రోడ్డు మీదకి నాలుగు సింహాలు వస్తే ఎలా ఉంటుంది. గుండెలో దడ పుడుతుంది. గుండె గట్టిదైతే ప్రాణం ఉంటుంది. లేదంటే పైప్రాణాలు పైనే పోతాయి మరి. అలాంటి అడవిని పాలించే నాలుగు మృగరాజులు రోడ్డుపై తారసపడ్డాయి.

వాహనాలతో బిజీగా ఉన్న రోడ్డు మీదకు నాలుగు సింహాలు వస్తే ఎలా ఉంటుంది. గుండెల్లో దడ పుడుతుంది. గుండె గట్టిదైతే ప్రాణం ఉంటుంది. లేదంటే పైప్రాణాలు పైనే పోతాయి మరి. అలాంటి అడవిని పాలించే నాలుగు మృగరాజులు రోడ్డుపై తారసపడ్డాయి. ఒకదాని వెనుక మరొకటి రాజసం ఉట్టిపడేలా నడుస్తూ వెళ్తున్నాయి. అదే మార్గంలో వెళ్లే వాహనదారులకు చుక్కలు చూపించాయి. ప్రాణాలను అరచేతుల్లో పట్టుకొని వాహనాదారులు తమ వాహనాలను నెమ్మదిగా నడుపుతూ వెళ్లారు. కొంచెం ఏమరపాటుగా ఉన్నా.. సింహాలకు చిరెత్రుకొచ్చేలా తుంటరి పనిచేసినా ఖతం.. చీల్చి చెండాడేస్తాయి అనడంలో సందేహం లేదు. 

ఒళ్లు గగొర్పొడిచేలా ఉన్న ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. లయన్స్ ఆఫ్ క్రూగర్ పార్క్ అండ్ సాబీ శాండ్’ అనే ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అర నిముషం పాటు నిడివి ఉన్న ఈ వీడియోకు  ఇప్పటివరకూ 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. టన్నుల కొద్ది కామెంట్లు వచ్చాయి. రెండు వారాల క్రితం ఈ వీడియోను షేర్ చేయగా.. 34వేల షేర్లు, వేలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే..