ఫుట్ బాల్ మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ సీన్ : బాల్ కు, బట్టతలకు తేడా తెలుసుకోలేకపోయిన AI టెక్నాలజీ..!!

Scotland foot ball match AI Camera : ఇటీవల స్కాట్లాండ్ లో జరిగిన ఫుట్ బాల్ పోటీలో ఇంట్రెస్టింగ్ సంఘటన చోటుచేసుకుంది. స్టేడియం గ్యాలరీ పైభాగంలో అమర్చిన ఓ AI (కృత్రిమ మేధ) కెమెరా ఫుట్ బాల్ బట్టతలకు తేడా కనుక్కోలేక తికమకపడిపోయింది. ఈ తికమకకు గురైన AI కెమెరా మ్యాచ్ లో బంతిని చూపించడానికి బదులు లైన్స్ మన్ కు ఉన్న బట్టతలనే ఫుట్ బాల్ అనుకని మ్యాచ్ లో ఎక్కవ భాగం ఆ లైన్స్ మన్ బట్టతలనే చూపించింది. ఆ లైట్ మన్ ఎటు కదిలితే ఈ కెమెరా అటే తన దృష్టి సారించింది (యాంగిల్ ను తిప్పుకుంది).
ఫుట్ బాల్ పోటీలో బంతి కోసం పోటీలో పాల్గొన్న ఇరుజట్లు హోరాహోరీగా పోరాడుతుంటే… అదంతా వదిలేసి లైన్స్ మన్ వెంట పడింది ఆ AI కెమెరా (కృత్రిమ మేధ). అతను ఎటు పరుగులు తీస్తే అటు తన లెన్స్ ను ఫోకస్ చేస్తూ గందరగోళం సృష్టించింది.
https://10tv.in/murdered-poker-star-died-with-her-tongue-on-fire-after-horrific-attack/
ఈ కెమరా ఎందుకిలా చేస్తోందీ అని టెక్నీషియన్ల విశ్లేషించగా అసలు విషయం బైటపడింది. ఆ AI కెమెరా లైన్స్ మన్ బట్టతలను ఫుట్ బాల్ గా పొరబడిందట. నున్నగా గుండ్రంగా ఉండేసరికి అదే బంతి అనుకుని అటువైపే కవర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా..యూరప్ దేశాల్లో ఫుట్ బాట్ ఆట అంటే ఎంత క్రేజో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో యూరప్ దేశాల్లో నిత్యం ఫుట్ బాల్ పోటీలు ఎక్కడోచోట జరుగుతునే ఉంటాయి. క్లబ్ సంస్కృతి ఎక్కువగా ఉండే యూరప్ దేశాల్లో ఫుట్ బాల్ అంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే మ్యాచ్ ప్రసారాల కోసం బ్రాడ్ కాస్టర్లు అత్యాధునిక టెక్నాలజీ వాడుతుంటారు.
ఈ క్రమంలో స్కాట్ లాండ్ లో ఇటీవల జరిగిన ఫుట్ బాల్ పోటీల్లో (కృత్రిమ మేధ) పరిజ్ఞానాన్ని కూడా ఇప్పుడు మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ కోసం వినియోగిస్తున్నారు. ఈ AI కెమెరాలు నిర్దేశిత ప్రోగ్రామ్ కు అనుగుణంగా మ్యాచ్ ను తమంతట తామే కవర్ చేసేలా ఏర్పాటు చేశారు.
బంతి ఎటు వెళితే అటు తమ యాంగిల్స్ సరిచేసుకుంటాయి. ఈ క్రమంలో లైట్ మన్ బట్ట బుర్రనే ఫుట్ బాల్ అనుకుని ఆ AI కెమెరా పాపం తికమకపడిపోయి చూసేవాళ్లకు కూడా గందరగోళనాకి గురిచేసింది. భలే ఉంది కదూ ఈ AI కెమెరా తికమక మకతిక..