కారల్‌మార్క్స్‌ సమాధి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు

కారల్‌ మార్క్స్‌ సమాధి సీసీ కెమెరాలు నిఘా నీడలో ఉండనుంది. మార్క్స్‌ సమాధి పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 03:28 PM IST
కారల్‌మార్క్స్‌ సమాధి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు

Updated On : December 26, 2019 / 3:28 PM IST

కారల్‌ మార్క్స్‌ సమాధి సీసీ కెమెరాలు నిఘా నీడలో ఉండనుంది. మార్క్స్‌ సమాధి పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

కారల్‌ మార్క్స్‌ సమాధి సీసీ కెమెరాలు నిఘా నీడలో ఉండనుంది. మార్క్స్‌ సమాధి పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లండన్‌లోని హైగేట్‌ శ్మశానవాటికలోని కారల్‌మార్క్స్‌ సమాధి దగ్గర సీసీ కెమెరాలను అమర్చారు. మార్క్స్‌ సమాధిపై ఈ ఏడాది రెండుసార్లు దాడులు జరిగిన నేపథ్యంలో ఈ స్మారకచిహ్నాన్ని పరిరక్షిస్తున్న మార్క్స్‌ గ్రేవ్‌ ట్రస్ట్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. 

బ్రిటన్‌ వారసత్వ సంపద పరిరక్షణకు ఉద్దేశించిన హిస్టారిక్‌ ఇంగ్లండ్‌ సంస్థతోపాటు భద్రతా నిపుణుల అభిప్రాయాల మేరకు నిఘా కెమెరాలను అమర్చారు. ఈ శ్మశానవాటికలో నిఘా కెమెరాలను అమర్చడం ఇదే ప్రథమం. మార్క్స్‌ పాలరాతి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు దుండగులు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండుసార్లు ప్రయత్నించారు. 

జనవరిలో మార్క్స్‌ అనే అక్షరాలపై విధ్వంసకారులు సుత్తితో కొట్టి, ధ్వంసం చేశారు. ఫిబ్రవరిలో మార్క్స్ విగ్రహంపై చేసిన దాడిలో విగ్రహం దిమ్మెపై ద్వేష సిద్ధాంతం, మారణహోమం శిల్పి.. అని రాశారు. దీనిపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. కార్మికులను, ప్రజలను పీడనకు గురిచేసే వారిని దోపిడీ చేస్తున్న పెట్టుబడి వ్యవస్థ గుట్టువిప్పాడు కారల్‌ మార్స్క్‌. దాస్ కాపిటల్ అనే గ్రంథాన్ని రాశారు.