కూలిపోయిన యుద్ధ విమానం : ఏడుగురు మృతి

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 04:00 AM IST
కూలిపోయిన యుద్ధ విమానం : ఏడుగురు మృతి

Updated On : October 3, 2019 / 4:00 AM IST

అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన ఈశాన్య అమెరికా రాష్ట్రం కనెక్టికట్‌లోని బ్రాడ్లీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం (అక్టోబర్ 2) ఉదయం 10 గంటలకు జరిగింది.ఇది రెండవ ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బాంబర్ విమానం. టేకాఫ్ అయిన పదినిమిషాలకే టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దీన్ని గుర్తించి..ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలోనే కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉండగా వారిలో  ఏడుగురు మరణించారు. మిగిలిన ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని హాస్పిటల్ కు ఆసుపత్రికి తరలించామని ఎమర్జెన్సీ సర్వీసులు..ప్రజారక్షణశాఖ కమిషనర్ జేమ్స్ రోవెల్లా వెల్లడించారు.
ఈ విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై ఉన్న మరో వ్యక్తి కూడా గాయపడ్డాడనీ..విమానం కూలిన రన్ వేపై మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించిందనీ తెలిపారు.  దీంతో బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడున్నర గంటలపాటు మూసివేశారు. యుద్ధ విమాన ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తోంది.