Lock Down : షాంఘైలో నేటి నుంచి లాక్ డౌన్- మూకుమ్మడిగా కోవిడ్ పరీక్షలు

చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్ధిక నగరంగా పేరుపొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు రికార్డు స్ధాయిలో పెరిగాయి. కానీ ప్రజలకు కోవిడ్ సోకినా లక్షణాలు

Lock Down : షాంఘైలో నేటి నుంచి లాక్ డౌన్- మూకుమ్మడిగా కోవిడ్ పరీక్షలు

Shanghai Covid

Updated On : March 28, 2022 / 7:22 AM IST

Lock Down :  చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్ధిక నగరంగా పేరుపొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు రికార్డు స్ధాయిలో పెరిగాయి. కానీ ప్రజలకు కోవిడ్ సోకినా లక్షణాలు మాత్రం కనిపించలేదు.

దీంతో ఈరోజు నుంచి దశల వారీగా షాంఘైలో లాక్ డౌన్ అమలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. షాంఘై నగరంలో 2.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రాధమిక దశలోనే దీనిని అంతమొందించేందుకు షాంఘై నగరాన్ని అధికారులు రెండు భాగాలుగా విభజించారు.
Also Read : Covid Callertunes : ఇకపై కొవిడ్​ కాలర్​ ట్యూన్లు బంద్​!
నగరంలోని ప్రజలందరికీ మూకుమ్మడిగా కోవిడ్ టెస్టు లు చేయాలని నిర్ణయించారు. ప్రజలందరికి కోవిడ్ టెస్టింగ్ కిట్లను నేటి నుంచి అందచేయనున్నారు. జిలిన్ లోని ఈశాన్య ప్రావిన్స్ లో   కూడా 500,000 ర్యాపిడ్-యాంటిజెన్ కిట్‌లను పంపిణీ చేయడం ప్రారంభించారు. 2019 చివరిలో  చైనాలోని  వూహాన్ నగరంలో  కరోనా బయట పడటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అదుపు చేయగలిగింది.