భయంకరమైన దురద.. తట్టుకోలేక : ఆమె చెవిలో విష సాలీడు! 

ఆ రాత్రి బాగా నిద్రపోయింది. ఉదయం లేవగానే ఎడమ చెవి దురదగా అనిపించింది. లైట్ గా తీసుకుంది. కాసేపటికి దురద భయానకంగా మారింది.

  • Published By: sreehari ,Published On : August 24, 2019 / 12:45 PM IST
భయంకరమైన దురద.. తట్టుకోలేక : ఆమె చెవిలో విష సాలీడు! 

Updated On : August 24, 2019 / 12:45 PM IST

ఆ రాత్రి బాగా నిద్రపోయింది. ఉదయం లేవగానే ఎడమ చెవి దురదగా అనిపించింది. లైట్ గా తీసుకుంది. కాసేపటికి దురద భయానకంగా మారింది.

ఆ రాత్రి బాగా నిద్రపోయింది. ఉదయం లేవగానే ఎడమ చెవి దురదగా అనిపించింది. లైట్ గా తీసుకుంది. కాసేపటికి దురద భయానకంగా మారింది. చెవి ఊడిపడేంతగా దురద పెట్టేసింది. ఏమైందో అర్థంకాలేదు.. ఎందుకు అలా దురద వస్తుందో తెలియలేదు. రాత్రి స్విమ్మింగ్ చేసిన తర్వాత చెవిలోకి నీళ్లు గానీ పోయి ఉంటాయిలే అని సరిపెట్టుకుంది. 

అయినా దురద వదలడం లేదు. తట్టుకోలేనంత దురద.. విలవిలాడిపోయింది. చివరికి వైద్యున్ని సంప్రదించగా… ఆమె చెవిలో నీళ్ల కారణంగా కాదని డాక్టర్లు తేల్చేశారు. చెవిలో ఓ కీటకం ఉన్నట్టు గుర్తించారు. అది ఏంటి? అనేది వైద్యులు మరోసారి టెస్టులు చేశారు. సుషే టోరీస్ అనే మహిళ చెవిలో సాలీడు పురుగు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఘటన కన్సాస్ సిటీ మస్సోరిలో జరిగింది. 

గోధుమ రంగులో ఉన్న విషపూరితమైన సాలీడుగా నిర్ధారించారు. అదృష్టవశాత్తూ సాలీడు కుట్టలేదు. లేదంటే.. మహిళ ప్రాణాలు పోయేవి. వైద్యులు సాలీడును ఆమె చెవిలో నుంచి తొలగించడంతో ఊపిరిపీల్చుకుంది. ఇకపై రాత్రి పడుకునే సమయంలో సాలీడు వంటి కీటకాలు పోకుండా చెవిలో దూది పెట్టుకోమని వైద్యులు సలహా ఇచ్చారు. ఒకవేళ విషపూరితమైన ఈ సాలీడు కుట్టి ఉంటే.. వెంటనే వికారం.. కళ్లు తిరగడం.. శ్వాస తీసుకోలేకపోవడంతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉంటాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. 

సాధారణంగా ఈ సాలీడులు దాడిచేయవు. కానీ, కొన్నిసార్లు అవి చిక్కుకున్నా లేదా అనుకోకుండా టచ్ చేసినా కుట్టే అవకాశం ఉంది. ఇవి సాలీడు గూడులో కంటే బయటే ఎక్కువగా తిరిగుతు నడుస్తూ ఉంటాయి. మనుషుల చెవిలోకి సాలీడు దూరడం వింత కాదు. చైనాలో ఒక వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వేల్స్ లో ఒక మహిళ, ఇండియాలో ఒక మహిళ, ఒరిగాన్ లో 9ఏళ్ల బాలుడి చెవిలో సాలీడు దూరిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.