ISSF షూటింగ్ వరల్డ్‌కప్: స్వర్ణం సాధించి మనూ భాకర్ వరల్డ్ రికార్డ్

అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ బంగారు పతకాన్ని సాధించింది. చైనాలోని పుటియన్‌లో జరిగిన ఈవెంట్‌లో భారత యువ షూటింగ్ సంచలనం 17 సంవత్సరాల మనూ బాకర్ ప్రపంచం కప్ ఫైనల్స్ లో గోల్డ్ గెలుచుకుంది. జూనియర్ విభాగంలో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో 244.7 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించి ప్రపంచ రికార్డును సృష్టించింది. తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మనూ బాకర్ స్థానం సంపాదించింది.
ఈ ఈవెంట్‌తో జూనియర్ వరల్డ్ రికార్డును కూడా మనూ బ్రేక్ చేసింది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ క్యాటగిరీలో గతంలో భారత షూటర్ హీనా సింధు తరువాత ఈ ఘనతను సాధించిన భారతీయురాలిగా మనూ భాకర్ చరిత్ర సృష్టించింది.
ప్రస్తుత టోర్నీలో సెర్బియాకు చెందిన జోరాన అరునోవిక్ 241.9 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. చైనా యువతి క్వియాన్ వాంగ్ 221.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మరో భారతీయ షూటర్ యశశ్విని దేశ్‌వాల్ 158.8 పాయింట్లు స్కోర్ చేసి 6వ స్థానంలో నిలిచింది.
Shooter Manu Bhaker has won gold in Women’s 10m Air Pistol with a new junior world record score of 244.7 at ISSF World Cup Final. (file pic) pic.twitter.com/y0qbsoAzzG
— ANI (@ANI) November 21, 2019