బజార్ లో పోర్న్..గంటలపాటు బిగ్ స్క్రీన్ లపై

  • Published By: venkaiahnaidu ,Published On : September 30, 2019 / 03:51 AM IST
బజార్ లో పోర్న్..గంటలపాటు బిగ్ స్క్రీన్ లపై

Updated On : September 30, 2019 / 3:51 AM IST

 ఓ స్పోర్ట్స్ వేర్ షాప్ డోర్స్ పై ఉన్న  ప్రమోషనల్‌ స్క్రీన్‌పై పోర్న్‌ వీడియోలు కనబడటంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆదివారం ఉదయం ఈ ఘటన న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సెంట్రల్‌ అక్లాండ్‌లోని షార్ట్ ల్యాండ్ స్ట్రీట్ లోని అసిక్స్‌ అనే స్పోర్ట్స్‌ స్టోర్‌ బయట ఉన్న ప్రమోషనల్‌  స్క్రీన్‌పై ఒక్కసారిగా పోర్న్ వీడియోలు ప్లే అయ్యాయి. పోర్న్‌ వీడియోలు ప్లే కావడంతో అక్కడున్న ప్రజలు, ఇబ్బంది పడాల్సి వచ్చింది. కుటుంబసభ్యులతో, చిన్నపిల్లలతో కలిసి రోడ్డుపై వచ్చిన వారు ఆ దృశ్యాలను చూసి ఖంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు మాత్రం ఆ దృశ్యాలను చూస్తూ అక్కడే ఉండిపోయారు. సాధారణంగా ఆ స్టోర్‌ను ఉదయం 10గంటలకు తెరుస్తారు. అయితే ఉదయం 8 గంటల నుంచి స్టోర్‌ తెరపై పోర్న్‌ వీడియోలు ప్లే అవుతూనే ఉన్నాయి. ఇలా దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఆ తర్వాత స్టోర్‌ నిర్వహకులు ఆ వీడియోలు ప్లే కాకుండా చూశారు.

అయితే ఎవరో హ్యాకింగ్‌ చేయడం వల్లనే ఇలా జరిగిందని స్టోర్‌ ప్రతినిధి తెలిపారు. దీనిపై క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని… మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామన్నారు.