సింగపూర్ కు వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి

సింగపూర్ కు వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి

Updated On : January 17, 2021 / 6:04 PM IST

Singapore to Require All Inbound Travelers Take Virus Tests from 25th January : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో జనవరి 25 తర్వాత సింగపూర్ కు వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్ష తప్పని సరిగా చేసుకోవాలని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకు సింగపూర్ లో ఉండే నానా రెసిడెంట్స్ ,యాత్రికులు ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత కొన్నాళ్లు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలి, ప్రజల్లో తిరగాలి అనుకుంటే మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సి వచ్చేది.

సింగపూర్ ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం ఇప్పడు స్ధానిక ప్రజలు కూడా తప్పని సరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. యునైటెడ్ కింగ్ డమ్, సౌత్ ఆఫ్రికా వంటి ప్రదేశాల లో స్ట్రెయిన్ వైరస్ అధికంగా ఉండటంతో అక్కడి నుంచి వచ్చిన వారు కొత్త నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్ లోనూ, మరోక వారం రోజుల పాటు వారి ఇంటివద్ద హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని షరతు విధించింది.

యూకే, దక్షిణాఫ్రికా నుంచి సింగపూర్ వచ్చేవారు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రెసిప్రోకల్ గ్రీన్ లేన్ అండ్ ఎయిర్ ట్రావెల్ పాస్ ఏర్పాట్ల కింద దరఖాస్తుచేసుకోవాలని తెలిపింది. దీనికింద కరోనా వైరస్ చికిత్స కొసం 22,560 డాలర్లు కవరేజి ఉన్న ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపారు. ఆదివారం జనవరి 17 నాటికి విదేశాలనుంచి సింగపూర్ వచ్చిన వారిలో 28 మందికి కరోన సోకినట్లు గుర్తించారు. వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు.