ఆరడుగుల దూరంలో నిల్చొన్నా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేం

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 04:17 AM IST
ఆరడుగుల దూరంలో నిల్చొన్నా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేం

Updated On : May 20, 2020 / 4:17 AM IST

గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ లలో ఒకటైన COVID-19 గురించి పూర్తిగా అవగాహన రావడం లేదు. కనీసం 3అడుగుల దూరం ఉండాలని చెప్పి దానిని 6అడుగుల దూరానికి పెంచింది WHO. లేటెస్ట్ గా నిర్వహించిన ఓ స్టడీ ప్రకారం.. కనీస 6 అడుగుల దూరం కూడా సేఫ్ గా ఉంచుతుందనే నమ్మకం లేదు. Talib Dbouk,  Dimitris Drikakisలు కలిసి నిర్వహించిన Physics of Fluids స్టడీ వివరాలిలా ఉన్నాయి. 

గంటలకు 4కిలోమీటర్ల వేగంతో చిన్నపాటి తుమ్ము వచ్చినా..   సెలైవా 5సెకన్లలో 18అడుగుల దూరం వరకూ వ్యాపిస్తుందట. ‘ఆ నీటి తుంపర్లు యువకులనే కాదు, పలు రకాల ఎత్తులో ఉన్న చిన్నారులపైనా ప్రభావం చూపిస్తుంది’ అని ద్రుకాకిస్ అన్నారు. ‘తక్కువ ఎత్తు ఉన్న (పొట్టి వాళ్లు, చిన్న పిల్లలు కరోనా పేషెంట్‌కు ఎక్కువ దూరంలో ఉన్నప్పటికీ సెలైవా తుంపర్లు మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’

సెలైవా అనేది ఓ కాంప్లెక్స్ ద్రావణం. దగ్గినప్పుడు గాల్లోకి వెలువడుతుంది. ఈ తుంపర్ల వ్యాప్తికి పలు కారణాలు ఉన్నాయి. అందులో వాటి సైజు కూడా ఓ కారణమే. పరిసరాల్లో వ్యాపించే పద్ధతి ఎలా ఉంటుందంటే హీట్ ఎలా అయితే ఒక చోటు నుంచి మరొక చోటుకు చేరుతుందో అలా.. చుట్టూ ఉన్న గాలిలో తేమ, ఉష్ణోగ్రతతో పాటు కలిసిపోతాయి. 

గాలిలో సెలైవా చలనం గురించి తెలుసుకోవడానికి కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఏర్పాటు చేశారు. దగ్గుతూ ఉండే వ్యక్తి చుట్టూ ఉన్న గాలిలో ఆ తుంపర్లు ప్రయాణిస్తూనే ఉంటాయి. హ్యుమిడిటీ, విస్తృతంగా వ్యాపించే శక్తి, సెలైవా, గాలితో పాటు కలిసే అనువుల వేగం, ద్రావణం నుంచి తుంపర్లు ఆవిరిగా మారే ప్రక్రియలపై ఆధారపడి ఉంటాయి. 

ఇలా బయటికొచ్చే తుంపర్లలోని ఒక్కో కణంలో ఒత్తిడి, ద్రావణ్ వేగం, ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి, తుంపర్ల స్థానం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. నేల ఉష్ణోగ్రతపై కూడా సెలైవా వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ గాలి వేగం పెరుగుతుంది కాబట్టి.. అక్కడ తుంపర్లు సైతం మరింత వేగంగా ప్రయాణిస్తాయి. మూసి ఉన్న ప్రదేశం అంటే నాలుగు గోడల మధ్యలో అయితే ఫ్యాన్ లేదా ఏసీ గాలి దిశను బట్టి వ్యాప్తి జరుగుతుంది. 

Read: మాస్క్ తీయకుండానే..తినొచ్చు..తాగొచ్చు