Slovenia Government: ఆ ప్రభుత్వం సంచలనం.. రేషన్ తరహాలో పెట్రోల్, డీజిల్.. రోజుకి ఇన్ని లీటర్లే..
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెట్రో కొరత ఏర్పడింది. దీంతో యూకేలోని ఇతర దేశాల్లో భారీగా పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Slovenia Government: స్లోవేనియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ తరహాలో పెట్రోల్, డీజిల్ కేటాయించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని అమలు చేసిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్లోవేనియా నిలిచింది. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెట్రో కొరత ఏర్పడింది. దీంతో ఈయూలోని ఇతర దేశాల్లో భారీగా పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
స్లోవేనియాలో రేట్లు తక్కువ కావడంతో పొరుగు దేశాల నుంచి వచ్చి ఫుల్ ట్యాంక్స్ కొట్టించుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. ఫ్యూయల్ టూరిజంను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ తరహాలో కోటా అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ లెక్కన వ్యక్తులకు ఒకరికి రోజుకు 50 లీటర్లే పెట్రోల్, డీజిల్ ఇస్తారు. అదే సంస్థలకు అయితే రోజుకు 200 లీటర్లు మాత్రమే ఇస్తారు.
ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా దళాలు సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాన్ సైతం తగ్గేదేలే అంటోంది. ప్రత్యర్థులకు ధీటుగా బదులిస్తోంది. ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై అటాక్స్ చేస్తోంది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ క్షేత్రాలపైనా దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధిపై సైతం ఆంక్షలు విధించింది. నౌకల రాకపోకలను నియంత్రించింది. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఇరాన్ చర్యలతో తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడింది. ఇంధన నిల్వలు అయిపోవడంతో చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంధన కొరతను ఎదుర్కొనే ప్రయత్నంగా యూరోపియన్ యూనియన్ సభ్యదేశం స్లోవేనియా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఇంధన రేషన్ విధానాన్ని అమలు చేసింది. విదేశీ డ్రైవర్ల కోసం కఠినమైన పరిమితులను పెట్టింది. ఇంధన రేషన్ రూల్స్‌లో భాగంగా వ్యక్తిగత వాహనదారులు రోజుకు గరిష్టంగా 50 లీటర్ల ఇంధనం వరకు కొనుగోలు చేయచు. వ్యాపారాలు, రైతులకు మరింత సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. వారు రోజుకు 200 లీటర్ల వరకు కొనుగోలు చేయచ్చు.
స్లోవేనియాలో తగినంత ఇంధనం ఉందని, ఇంధనం గిడ్డంగులు నిండుగా ఉన్నాయని ఆ దేశ ప్రధాన మంత్రి రాబర్ట్ గోలోబ్ తెలిపారు. దేశంలో ఇంధన కొరత ఉండదని ప్రజలకు హామీ ఇచ్చారు.
