తొలిసారి మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంచు తుఫాన్

తొలిసారి మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంచు తుఫాన్

Updated On : February 19, 2021 / 1:15 PM IST

Snow Storms in Middle East: సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తొలిసారి మంచుదుప్పటి కప్పుకున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోతుంది. అంతేకాకుండా ఈ కారణంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ను వాయిదా వేశారు. దాంతో పాటు కొన్ని యూనివర్సిటీలు నిర్వహించే పరీక్షలు కూడా రద్దు అయిపోయాయి.

గురువారం తెల్లవారే లేచి చూడగానే.. రోడ్లు మొత్తం మంచుతో కప్పి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. జెరూసలెంలోనూ అదే పరిస్థితి. వాతావరణంలోని మార్పులు ఎందుకొచ్చాయనేది కాకుండా మంచుగడ్డలతో పిల్లలు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. పవిత్ర ప్రదేశాల్లో కురిసిన మంచుతో యూదులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉల్లాసంగా గడిపారు.

బుధవారం సాయంత్రం నుంచి మంచు తుఫాన్ కురిసింది. ఈ కారణంగానే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఆపేశారు. జెరూసలెం రోడ్ ను బ్లాక్ చేశారు. ఈ మంచు తుఫాన్ ఆగిన వెంటనే సర్వీసులు మొదలుపెడతామని అధికారులు అంటున్నారు. కిర్యాత్ గట్ ప్రాంతంలో హైపోథెర్మియా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

పలు రకాల వాతావరణ పరిస్థితుల కారణంగా.. స్కూల్స్, యూనివర్సిటీలు మూసేసి క్లాసులను వాయిదా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలి గంటకు 52 నుంచి 62 మైళ్ల వేగంతో వీస్తుంది. ఈ సంవత్సరం అత్యధికంగా మంచు కురిసిన ప్రాంతాల్లో పొరుగు ప్రాంతాలైన లెబనాన్, స్టార్మ్ జాయ్స్ కూడా ఉన్నాయి.

snow storm 1

snow storm 1