United States : రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ప్రముఖ సింగర్.. అంత కష్టం ఏం వచ్చింది?

పేరున్న పాప్ సింగర్.. రెస్టారెంట్‌లో పనిచేయడం చూసి జనం షాకయ్యారు. ఆమెకి ఏం కష్టం వచ్చిందో అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంతకీ ఎవరా సింగర్?

United States : రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ప్రముఖ సింగర్.. అంత కష్టం ఏం వచ్చింది?

United States

United States : మనం ఎంతగానో ఇష్టపడే సెలబ్రిటీస్ సడెన్‌గా ఓ హెటల్ లోనో.. మాల్ లోనో పనిచేస్తున్నట్లు కనిపిస్తే .. అయ్యో? వీరికి ఇంత కష్టం ఎందుకు వచ్చిందని షాకవుతాం. అమెరికన్ పాప్ సింగర్ కం రైటర్ లానా డెల్ రే యుఎస్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది?

Pakistan: దమ్ముంటే ఆ సింగర్‭ని విమర్శించండి చూద్దాం.. నెటిజెన్లకు ఛాలెంజ్ విసిరిన పాక్ సింగర్

38 సంవత్సరాల పాప్ సింగర్ లానా డెల్ రే యుఎస్‌లోని రెస్టారెంట్ లో పనిచేస్తున్నట్లు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రీమతి రే కాఫీ తయారు చేసి ఆర్డర్లు తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. యూనిఫాంతో పాటు పేరు ట్యాగ్‌ని ధరించి వాఫిల్ హౌస్ కౌంటర్ వెనుక కాఫీ తయారు చేస్తుంటే ఓ అభిమాని ఫోటోలు తీశాడు.

Chinmayi Sripada : సీఎంపై అసహనం వ్యక్తం చేసిన సింగర్ చిన్మయి.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న..

రీసెంట్‌గా తన కొత్త ఆల్బమ్‌ను కూడా ఈ సింగర్ విడుదల చేసింది. దాంతో రెస్టారెంట్‌లో ఈమె పనిచేయాల్సిన అవసరం ఏం వచ్చిందని నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదంతా తన వీడియో కోసం చేసే స్టంట్‌గా కొందరు భావించారు. ఏది ఏమైనా ఈ సింగర్ మాత్రం అక్కడ ఎందుకు పనిచేస్తోందో వివరాలు చెప్పకుండా తన అభిమానుల్ని సందిగ్థంలో పడేసింది.