Viral Resign Letter : మహిళా ఉద్యోగి వెరైటీ రిజైన్ లెటర్..బాస్ కి దిమ్మ తిరిగిపోయిందిగా..
ఓ మహిళా ఉద్యోగి బాస్ కి ఇచ్చిన రిజైన్ లెటర్ వైరల్ గా మారింది. ఆ లెటర్ చూసిన బాస్ దిమ్మ తిరిగిపోయింది.

Female Employee Variety Resign Letter
Female Employee Variety Resignation Letter : ఓ మహిళ తను జాబ్ కు రిజైన్ చేస్తు తన బాస్ కు రాసిన లెటర్ వైరల్ గా మారింది. తన రిజైన్ లెటర్ ను చాలా వెరైటీగా రాసింది. ఆ లెటర్ చూసిన సదరు బాస్ కు దిమ్మ తిరిగిపోయిన ఈ వెరైటీ రిజైన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేధించే బాస్ కు తాను వెళుతు వెళుతు ఓ ఝలక్ ఇవ్వాలనుకుంది. అలా తన రిజైన్ లెటర్ ను వెరైటీగా రాయాలనుకుంది. తన ప్రతాపాన్ని రాజీనామా లెటర్‌లో చూపించింది.
Read more : viral letter : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి..చూసిపెట్టండి సార్…
‘‘నువ్వు ఇక వేధించడానికి నేను ఉండను. దానికి నీకు సా’ అంటూ రాసిన ఆ ఉద్యోగిని..అది నేనే. ఇంకో రెండు వారాల్లో నేను కంపెనీని వదిలి వెళ్లిపోతున్నా అంటూ వెరైటీగా రాజీనామా లెటర్‌ను రాసింది. ఆ లెటర్‌ను తీసుకెళ్లి తన బాస్‌కు ఇచ్చింది. అది చదివి అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అక్కడే నిలబడింది. అది చూసిన సదరు బాస్ మొఖం అవమానంతోను..ఏమీ చేయాలని పరిస్థితిలో ఉన్నవారు ఎలా ఉంటారో అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అతని పరిస్థితి చూసిన ఆమెకు సంతృప్తి కలిగింది. ఇవ్వాల్సింది ఇచ్చే పోతున్నా అనే ఫీలింగ్ కలిగింది.
Read more : కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..
ఆ లెటర్ చదివిన సదరు బాస్ ఇక ఏమీ చేయలేక మాటలు కూడబలుక్కున్నట్లుగా..నోరు పెగుల్చుకుని ‘మరో రెండు వారాలు పని చేయమని రిక్వెస్ట్ చేశాడు. అంతేతప్ప ఎందుకు రిజైన్ చేశావు అని మాత్రం అడగలేదు. తన రాజీనామా లెటర్‌ను రెడిట్‌లో ఆ ఉద్యోగిని పోస్ట్ చేయడంతో ఆ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్