Seoul Milk women As Cows : మహిళలను ఆవులుగా చూపిస్తూ ప్రకటన..వివాదంగా మారిన వీడియో
సౌత్ కొరియాకు చెందిన అతిపెద్ద డైరీ సంస్థ ప్రకటన వివాదమైంది. మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్..వివాదంగా మారింది.

Seoul Milk..women As Cows Add
Seoul Milk. women as cows : ప్రస్తుతం వ్యాపారాల్లో ప్రొడక్ట్ నాణ్యత ముఖ్యం కాదు..పబ్లిసిటీయే ముఖ్యం అన్నట్లుగా ఉంది ఈ పోటీ ప్రపంచంలో. తమ తమ వ్యాపారాల్లో లాభాల కోసం..పబ్లిసిటీయే ప్రధాన ఆయుధంగా మారింది. ప్రకటనలు వినూత్నంగా చేస్తు వినియోగదారులను ఆకట్టుకోవటానికి ఆయా కంపెనీలు వెరైటీగా ఆలయోచిస్తున్నాయి. అది బట్టల వ్యాపారమైనా..బంగారం వ్యాపారం అయినాసరే..ఆఖరికి వజ్రాల వ్యాపారమైనా సరే. తాగే పాలు నుంచి పడుకునే పరుపుల వరకు పబ్లిసిటీ..పబ్లిసిటీ.. పబ్లిసిటీ.
బిజినెస్‌ను పెంచుకోవడం కోసం.. తమ కంపెనీ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి ప్రకటనలే ఆయుధాలుగా ఉపయోగిస్తు వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి. మార్కెటింగ్ పద్ధతులతో వినియోగిస్తుంటాయి. ఎటువంటి వినూత్న యోచన అయినా యాడ్స్ ల్లో కనిపించాల్సిందే. ఫోటో యాడ్స్, వీడియో యాడ్స్ ద్వారా ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. కానీ కొన్ని యాడ్స్ అట్టర్ ప్లాప్ అవుతుంటాయి ఎంతగా ఆలోచించి చేసినా..ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినాసరే. కొన్ని యాడ్స్ వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి. అటువంటివి వివాదంగా మారుతుంటాయి.
Read more : Sabyasachi Mangalsutra : ఇది మంగళసూత్రం ప్రకటనా? లో దుస్తుల ప్రకటనా?! నెటిజన్ల ఫైర్
అదే జరిగింది సౌత్ కొరియాకు చెందిన అతి పెద్ద డెయిరీ కంపెనీ సియోల్ మిల్క్ మార్కెటింగ్ చేసే పనిలో భాగంగా చేసిన ఓ ప్రకటన వివాదమైంది. సియోల్ మిల్క్ తన డెయిరీ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఇటీవల ఓ వీడియో యాడ్‌ను చిత్రీకరించింది. ఈ యాడ్ లో మహిళలను ఆవులుగా చూపించింది. దీంట్లో కొంతమంది మహిళలు..తెల్లటి దుస్తులు ధరించి అడవిలో జలపాతాల వద్ద నీళ్లు తాగి.. పక్కనే ఉన్న పచ్చికబయళ్లలో యోగా చేస్తుంటారు.ఇంతలో ఓ వ్యక్తి ఆ అడవిలో ఫోటోలు తీస్తూ మహిళల్ని గమనిస్తాడు. ఇదేదో వెరైటీగా ఉందే అనుకుంటూ వాళ్లను సీక్రెట్‌గా ఫోటోలు తీస్తుంటాడు. చాలా ఉత్కంఠగా ఫీల్ అవుతు ఫోటోలు తీస్తుంటాడు. కానీ అంతలో ఓ పొరపాటు జరిగిపోతుంది. సదరు ఫోటో గ్రాఫర్ చెప్పు కింద ఉన్న చిన్న కట్టె పుల్ల విరిగి శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న మహిళలు వెంటనే ఆవులుగా మారిపోతారు.
ఆ ఫోటోగ్రాఫర్ ఇలా కిందికి చూసి తిరిగి పైకి చూసే సమయానికి అక్కడ మహిళలు కనిపించరు.. కొన్ని ఆవులు కనిపిస్తాయి. ఆ చుట్టుపక్కల ఎక్కడా మహిళలు ఉన్న జాడే కనిపించదు. దీంతో అతను షాక్ అవుతాడు. ఆశ్చర్యపోతాడు. ఈ యాడ్‌ను సియోల్ మిల్క్ కంపెనీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. అదే వివాదానికి దారి తీసింది.ఈ యాడ్‌పై సౌత్ కొరియా అంతా వివాదమైంది. ఆందోళనలు రేకెత్తించింది. మహిళలను ఆవులుగా చూపించడం ఏంటంటూ ఏకిపారేస్తున్నారు. మరికొంతమంది మహిళలను అలా సీక్రెట్‌గా వీడియో, ఫోటోలు తీయడం నేరం అంటూ తిట్టిపోస్తున్నారు.
Read more : Mangalsutra add : మంగళసూత్రం ప్రకటనపై సవ్యసాచికి హోంమంత్రి వార్నింగ్..
సౌత్ కొరియా వ్యాప్తంగా ఈ యాడ్‌పై చర్చలు నడుస్తుండగా.. యాడ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాగా.. వెంటనే సియోల్ మిల్క్ డెయిరీ కంపెనీ ఆ యాడ్‌ను వెంటనే తొలగిస్తున్నట్టు ప్రకటించి.. సౌత్ కొరియా ప్రజలకు క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ.. అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.