Nasa: విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న స్పేస్ఎక్స్ క్రూ-9.. స్వాగతం పలికిన సునీత, విల్మోర్
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.

SpaceX Crew-9 Arrives at ISS
Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. నాసా, స్పేస్ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ ను శనివారం రాత్రి ప్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. కొన్ని గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున స్పేస్ఎక్స్ క్రూ-9 విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఈ మిషన్ లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ వెళ్లారు. అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే వారికి సునీత విలియమ్స్, విల్మోర్ స్వాగతం పలికారు. స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ లో ప్రస్తుతం అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ తో పాటు సునీత, విల్మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి చేరుకునే అవకాశం ఉంది.
Also Read : NASA: అంతరిక్షంలో గ్రీన్ మాన్‌స్టర్‌ను పోలి ఉన్న ‘ఆకుపచ్చ కాంతి’ మెరుపు.. కారణాలను తెలిపిన నాసా
క్రూ-9 మిషన్‌ను ఈనెల 26నే ప్రయోగించాలని నాసా, స్పేస్‌ఎక్స్ భావించగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిషన్ ప్రయోగం వాయిదా పడింది. తిరిగి శనివారం సాయంత్రం క్రూ-9 మిషన్ ను ప్రయోగించారు. ఇదిలాఉంటే.. 2024 జూన్ నెలలో అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అందులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే, వారిని తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. వ్యోమగాములను స్టార్ లైనర్ పైకి తీసుకురావడం చాలా ప్రమాదకరమని నాసా నిర్ధారించింది. అంతరిక్ష నౌక సెప్టెంబర్ లో భూమికి తిరిగి చేరుకుంది. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్, విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ యొక్క క్రూ-9 మిషన్ ను నాసా ప్రయోగించింది.
The official welcome!
The Expedition 72 crew welcomed #Crew9, @NASAAstronauts Nick Hague, the Crew 9 commander and cosmonaut Aleksandr Gorbunov, the crew 9 mission specialist, after their flight aboard the @SpaceX Dragon spacecraft. pic.twitter.com/pOa8sTQWDo
— NASA’s Johnson Space Center (@NASA_Johnson) September 29, 2024