China Biggest Dam On Brahmaputra : భారత్ మీద మరో భారీ కుట్ర చేస్తున్న చైనా? బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్ట్ నిర్మాణం అందుకేనా..!
మరిప్పుడు భారత్ ఏం చేయబోతోంది? డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఇండియా ముందున్న ఆప్షన్లు ఏంటి? ఉన్నట్లుంది ప్రాజెక్ట్ విషయంలో చైనా ఎందుకు దూకుడు పెంచింది? ఏం చేయబోతోంది?

China Biggest Dam On Brahmaputra : దగుల్బాచీ వేషాలకు కేరాఫ్ అంటే వేళ్లన్నీ చైనా వైపే చూపిస్తుంటాయి. దోస్త్ అంటూ దోపిడీ చేయడం, స్నేహం పేరుతో కత్తులు దూయడం.. డ్రాగన్ కు నూడుల్స్ తో పెట్టిన విద్య. భారత్ తో సరిహద్దుల్లో ఓరాక్షన్ తగ్గించిన చైనా.. మళ్లీ నక్క బుద్ధులు చూపించడం మొదలుపెట్టింది. భారత్ మీద భారీ కుట్ర చేస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై ప్రాజెక్ట్ ను నిర్మిస్తూ మన దేశాన్ని మరోసారి ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్? నిర్మాణం వెనక డ్రాగన్ కుట్ర ఏంటి? భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?
భారత్ ను మళ్లీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం..
చైనా దరిద్రపు వేషాలు మరోసారి బయటపడ్డాయి. చైనా వెనక్కి తగ్గింది, బోర్డర్ లో పరిస్థితులు మారుతున్నాయి అని అనుకుంటున్న టైమ్ లో మరోసారి తన బుద్ధి ఏంటో చూపించింది డ్రాగన్. భారత్ ను మళ్లీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్ ఎదుగుదలను జీర్ణం చేసుకోలేకపోతున్న చైనా.. కాలు అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్ సరిహద్దులో ఉన్న దేశాలను తన గుప్పిట్లోకి తీసుకుని చైనా ఆడుతున్న నాటకాలు అన్నీ ఇన్నీ కావు.
Also Read : అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నందుకు జో బైడెన్ బాధపడుతున్నారా?
త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దది..
ఓవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్.. రెండు దేశాలను భారత్ మీదకు ఉసిగొల్పుతోంది. ఇప్పుడు మరో భారీ కుట్రకు తెరతీసింది. అరుణాచల్ ప్రదేశ్ కు దగ్గరగా బ్రహ్మపుత్ర నదిపై అతి పెద్ద డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ డ్యామ్ గా పేరున్న ఈ డ్యామ్.. త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దది కాబోతోంది. ఈ నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టిబెట్ ప్రాంతంలో భారత్ సరిహద్దుకు సమీపంలో దీన్ని నిర్మించేందుకు డ్రాగన్ రెడీ అవుతోంది.
ఒక్క ప్రాజెక్ట్.. వంద కుట్రలు..
ఒక్క ప్రాజెక్ట్.. వంద కుట్రలు.. ఇదీ బ్రహ్మపుత్ర నదిపై చైనా వ్యూహం. ప్రాజెక్ట్ పూర్తైతే భారత్ మీద ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. చైనా ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడం అంటే బ్రహ్మపుత్రను ఒక రకంగా కబ్జా చేయడమే. మరిప్పుడు భారత్ ఏం చేయబోతోంది? డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఇండియా ముందున్న ఆప్షన్లు ఏంటి? ఉన్నట్లుంది ప్రాజెక్ట్ విషయంలో చైనా ఎందుకు దూకుడు పెంచింది? ఏం చేయబోతోంది?
Also Read : వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?