Donald Trump : టార్గెట్ అక్రమ వలసదారులు..! ట్రంప్ సార్ చార్జ్ తీసుకోగానే అంతా సర్దుకోవాల్సిందేనా?

క్రమ వలసదారులను మెడపట్టి బయటకు గెంటేయడం పక్కానా? ట్రంప్ తీసుకునే స్టెప్ అతి పెద్ద బహిష్కరణగా మారబోతోందా?

Donald Trump : టార్గెట్ అక్రమ వలసదారులు..! ట్రంప్ సార్ చార్జ్ తీసుకోగానే అంతా సర్దుకోవాల్సిందేనా?

Updated On : December 14, 2024 / 2:30 AM IST

Donald Trump : నేషన్ ఫస్ట్.. ఆ తర్వాతే ఏదైనా.. ఇదే లైన్ ను ఫాలో అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్య అధ్యక్షుడిగా చార్జ్ తీసుకోకముందే రోజుకో బాంబు పేలుస్తూ గుండెలు గుబేల్ మనేలా చేస్తున్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగా అక్రమ వలసదారుల కథేంటో తేల్చుడేనని వార్నింగ్ లు ఇస్తున్నారు. పౌరసత్వ హక్కు పై కూడా సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు ట్రంప్. ఇలా రోజుకొక సంచలన ప్రకటన చేస్తూ కాక రేపుతున్న ట్రంప్. దీంతో సార్ చార్జ్ తీసుకోకముందే ఇలా ఉందంటే.. బాధ్యతలు చేపట్టాక ఇత్తడేనా అన్న చర్చ జరుగుతోంది అక్కడ. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులు సర్దుకోవాల్సిందేనా? సన్నిహిత దేశాలతో నూ ట్రంప్ తీరు మారనుందా?

ట్రంపే ఓ సెన్సేషన్. ఆయన డెసిషన్స్ షాకింగ్ న్యూస్. అమెరికా రక్షణ కోసం అధ్యక్షుడినయ్యా. అగ్రరాజ్యం కోసమే పని చేస్తా. ఇతర దేశాలకు మేలు చేసేందుకు తానిక్కడ లేనంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారుల విషయంలో తమ మాట వినని ఏ దేశమైనా, మిత్రువైనా సరే.. ఊరుకునేది లేదని ఊర మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. పౌరసత్వ హక్కుపై కూడా సమీక్ష ఉంటుందని ఝలక్ ఇచ్చాడు. అక్రమ వలసదారులను మెడపట్టి బయటకు గెంటేయడం పక్కానా? ట్రంప్ తీసుకునే స్టెప్ అతి పెద్ద బహిష్కరణగా మారబోతోందా?

 

Also Read : ఇస్రో దూకుడు.. 2035 నాటికి భారత్ కు సొంతంగా అంతరిక్ష కేంద్రం..!