ఇస్రో దూకుడు.. 2035 నాటికి భారత్ కు సొంతంగా అంతరిక్ష కేంద్రం..!

చంద్రయాన్, గగన్ యాన్.. ఇలా వరుస రీసెర్చ్ లతో పాటు స్పేస్ లో మనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తోంది ఇస్రో.

ఇస్రో దూకుడు.. 2035 నాటికి భారత్ కు సొంతంగా అంతరిక్ష కేంద్రం..!

Updated On : December 14, 2024 / 2:31 AM IST

ISRO : భారత్ ఫ్లవర్ నహీ.. వైల్డ్ ఫైర్ హై.. ఎక్కడైనా, ఎందాకైనా రెడీ.. నేటి భారత్ కు పోటీనే లేదంటోంది నయా ఇండియా. పరిగెడుతున్నాం, అభివృద్ధి చెందిన దేశంగా మారబోతున్నాం.. ఏ సెక్టార్ లో అయినా మనమేం తక్కువ లేం. డిఫెన్స్ నుంచి స్పేస్ వరకు భారత్ కూడా తోపే. ఒక్కో రంగంలో పటిష్టం అవుతూ వస్తున్న నయా భారత్.. స్పేస్ రీసెర్చ్ లో పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ ను దాటుతోంది.

వరుస పరిశోధనలతో తగ్గేదేలే అంటోంది ఇస్రో. రేపటి కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎన్నో మిషన్లను పూర్తి చేసిన ఇస్రో.. ఇప్పుడు గగన్ యాన్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా క్రయోజనిక్ ఇంజిన్ పరీక్షను విజయంవంతం చేసింది. మరో పదేళ్లలో సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోబోతోంది ఇండియా. స్పేస్ రీసెర్చ్ లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగబోతోందా? అగ్రదేశాలకు పోటీగా అంతరిక్షంలో సత్తా చాటడం ఖాయమా?

ఎన్నాళ్లని ఒకరిపై ఆధారపడతాం. డిపెండ్ అవడం కంటే ఇండిపెండెంట్ గా ఎదగడమే.. సో బెటర్. మన దగ్గరే అన్నీ ఉంటే.. పక్కోడి హెల్ప్ అవసరం లేదు కదా. అత్యవసరాల్లో అడుక్కునే అవసరం అసలే ఉండదు. అందుకే, స్పేస్ మిషన్ లో రారాజుగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది ఇస్రో. ఓవైపు ప్రయోగాలు చేస్తూనే మరోవైపు అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ను నిర్మించబోతోంది. చంద్రయాన్, గగన్ యాన్.. ఇలా వరుస రీసెర్చ్ లతో పాటు స్పేస్ లో మనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తోంది ఇస్రో. స్పేస్ స్టేషన్ ఎప్పటిలోగా కట్టబోతున్నారు? ఇప్పటివరకు ఏ దేశాలకు స్పేస్ స్టేషన్లు ఉన్నాయి?

 

 

Also Read : టార్గెట్ అక్రమ వలసదారులు..! ట్రంప్ సార్ చార్జ్ తీసుకోగానే అంతా సర్దుకోవాల్సిందేనా?