China Conspiracy : చైనా నుంచి భారత్ కు భారీ ప్రమాదం పొంచి ఉందా? నీటితో యుద్ధానికి కాలు దువ్వుతోందా?
ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడం అంటే బ్రహ్మపుత్రను ఒక రకంగా కబ్జా చేయడమేనా?

China Conspiracy : టార్గెట్ తెలియకుండా శత్రువును గందరగోళం చేయడమే అసలైన యుద్ధ తంత్రం. సంజూ అనే చైనీయుడు చెప్పిన యుద్ధ పాఠం ఇది. ఇప్పుడు భారత్ విషయంలో డ్రాగన్ అదే ఫాలో అవుతుందా అనిపిస్తోంది. ఇండియాను చూసి ఈర్ష్యతో రగిలిపోతున్న చైనా మరో కుతంత్రానికి తెర తీస్తుందా? నేల మీద శాంతి మంత్రం జపిస్తూ నీటితో యుద్ధానికి కాలు దువ్వుతోందా? ఇంతకీ డ్రాగన్ ఏం చేస్తోంది?
భారత్ ను చూసి రగిలిపోతున్న చైనా.. దెబ్బకొట్టేందుకు కుట్రలు..!
సూపర్ పవర్ గా ఎదుగుతున్న భారత్ ను చూసి కడుపు కాలిపోతోంది చైనాకు. సరిహద్దుల్లో సైన్యంతో, సరిహద్దుల్లో ఉన్న దేశాలతో మన దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. కుట్రలు మాత్రమే చేసే చైనా.. భారత్ విషయంలో పైచేయి సాధించాలని ప్రతీసారి ప్రయత్నిస్తూ బొక్కబోర్లా పడుతోంది. సరిహద్దుల్లో తోక జాడిస్తూ ఓవరాక్షన్ చేస్తోంది. గాల్వాన్ లోయ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య దూరం పెరగ్గా ఈ మధ్యే పరిస్థితులు కాస్త కూల్ అయ్యాయి.
Also Read : ఉద్యోగులా? బానిసలా? పని గంటల వ్యాఖ్యల చుట్టూ దుమారం..
భూమి మీద శాంతి మంత్రాలు, నీళ్లతో యుద్ధ సంకేతాలు..
చర్చలు సక్సెస్ అవడంతో ఎల్ఏసీ వెంట బలగాలు కాస్త వెనక్కి వెళ్లాయి. ఇక అంతా కూల్ అనుకుంటున్న సమయంలో డ్రాగన్ తోక వంకర అని మరోసారి ప్రూవ్ అయ్యింది. నేల మీద శాంతి మంత్రం జపిస్తున్న చైనా నీటిలో కుట్ర చేసేందుకు రెడీ అవుతోంది. ఇదే ఇప్పుడు భారత్ కు కొత్త ఆందోళనగా మారింది.

Brahmaputra Dam (Photo Credit : Google)
మరో బాంబు పేల్చిన చైనా.. బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద ప్రాజెక్ట్..
తూర్పు లద్దాఖ్ లో శాంతి చర్చలు జరుపుతున్న చైనా.. టిబెట్ లో బ్రహ్మపుత్ర నదిపై అతి పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరో బాంబు పేల్చింది. చైనా మెగా డ్యామ్ భారత దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత్, బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని ఈ డ్యామ్ దెబ్బతీసే ప్రమాదం ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో పర్యావరణానికి ముప్పు వాటిల్లనుంది. సైనిక వ్యూహ పరంగానూ ఇండియాకు ఈ డ్యామ్ ప్రమాదకరమని రక్షణ వర్గాలు వార్నింగ్ ఇస్తున్నాయి.
బ్రహ్మపుత్రను కబ్జా చేస్తుందా? భారత్ ఏం చేయబోతోంది?
భారత్ ను ఏమీ చేయలేక చెత్త వేషాలు వేస్తోంది చైనా. నీళ్లతో రాజకీయం మొదలు పెడుతోంది. బ్రహ్మపుత్ర మీద చైనా నిర్మించబోయే ప్రాజెక్ట్ 100 కుట్రలకు తావు తీస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయితే భారత్ మీద ఆ ప్రభావం ఎలా పడే ఛాన్స్ ఉంది? ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడం అంటే బ్రహ్మపుత్రను ఒక రకంగా కబ్జా చేయడమేనా? ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది?
Also Read : హుష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. దోషిగా తేలినా జైలు శిక్ష, జరిమానా విధించని కోర్టు!