90 Hour Work Week Row : ఉద్యోగులా? బానిసలా? పని గంటల వ్యాఖ్యల చుట్టూ దుమారం..

నిజంగా ఫ్యామిలీ వదిలేసి ఎక్కువ గంటలు కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుందా? వారి మాటలు నిజమేనా?

90 Hour Work Week Row : ఉద్యోగులా? బానిసలా? పని గంటల వ్యాఖ్యల చుట్టూ దుమారం..

Updated On : January 12, 2025 / 12:48 AM IST

90 Hour Work Week Row : పరుగులు తీస్తున్న ప్రపంచం. పోటీ పడుతున్న మనుషులు. ఆశలు, కోరికలు, ఉద్యోగాల్లో హోదాలు.. ఈ రేసులో పడి ప్రతీ ఒక్కరిపై ఒత్తిడి కనిపిస్తూనే ఉంది. పని బరువుల్లో, బాధ్యతల భారాల్లో నలిగిపోతున్నారు చాలా మంది. బతికేందుకు పని కావాలి. అంతేకానీ, పనే బతుకు కాకూడదు. అలాంటిదిప్పుడు పని గంటల చర్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

70 గంటలు పని చేయాలని ఓ పెద్దాయన అంటే.. పెళ్లాన్ని చూస్తూ ఏం కూర్చుంటారు.. 90 గంటలు పని చేయాలంటారు ఇంకొకరు. ఉద్యోగులంటే మరీ బానిసల్లా కనిపిస్తున్నారా? ఏఐ కాలంలోనూ ఇంత గొడ్డు చాకిరీనా? ఆ ఇద్దరు పెద్ద మనుషుల మాటలు రేపుతున్న రచ్చ ఏంటి?

రోజూ 8 గంటలు.. వారానికి 6 రోజులు.. ఇదీ మన దేశ వర్క్ కల్చర్..
రోజూ 8 గంటలు.. వారానికి 6 రోజులు.. ఇదీ మన దేశ వర్క్ కల్చర్. ఓ మనిషి శారీరకంగా, మానసికంగా పని చేయడానికి.. కుటుంబానికి, విశ్రాంతికి టైమ్ కేటాయించడానికి.. ఇంతకుమించి ఎక్కువ పని చేయడం మంచిది కాదు. ప్రపంచంలో చాలా దేశాలు రోజుకు 9 గంటలు, వారానికి 5 రోజులు పని పద్ధతిని పాటిస్తున్నాయి.

Also Read : హుష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. దోషిగా తేలినా జైలు శిక్ష, జరిమానా విధించని కోర్టు!

టెక్నాలజీ విస్తరించిన తర్వాత భారత్ లోనూ అలాంటి పద్ధతే వచ్చింది. పని ఉన్నా లేకపోయినా ఆ పని గంటల్లో ఏదో ఒక పని చేయించుకోవాలని అదే పనిగా పనులు చెబుతున్నారనే ఆరోపణలు చాలా కంపెనీల మీద ఉన్నాయి.

Working Hours In India

పని గంటల పేరుతో ప్రాణాలు తీస్తారా?
ఇదే పీక్స్ అనుకుంటే.. ఇప్పుడు పని ముందు ఫ్యామిలీ ఎందుకు దండగ అన్నట్లు కార్పొరేట్ పెద్దలు మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి పని గంటలపై సగటు ఉద్యోగి డైజెస్ట్ చేసుకోలేని మాట అంటే.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రమణ్యం మాటలు మరీ పరాకాష్టకు చేరాయి.

ఆయన 70 గంటలు పని చేయాలంటారు, ఈయనేమో 90 గంటలు పని చేయాలంటారు..
యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఓ సలహా పడేశారు ఆ మధ్య. వారానికి 7 రోజులు.. రోజూ 10 గంటలు పని చేయాలన్న మాట. వీకాఫ్ లేదు, ఫ్యామిలీ లేదు. అసలు ఎమోషన్స్ కూడా ఉండొద్దన్న మాట.

పోనీ ఒక రోజు సెలవు తీసుకుంటే.. ఆరు రోజుల పాటు రోజుకు పదకొండున్నర గంటలు పని చేయాలని చెప్పుకొచ్చారు. మరీ ఇంద చాదస్తం ఏంటి బాస్ అని నారాయణమూర్తి మీద సెటైర్లు పడుతున్న వేళ.. పెళ్లాం ముఖం ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు.. వారానికి 90 గంటలు పని చేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అభివృద్ధి చెందాలంటే ఎక్కువ పని చేయాలి. ఇద్దరు కార్పొరేట్ పెద్ద మనుషులు చెబుతున్న రీజన్ ఇది. నిజంగా ఫ్యామిలీ వదిలేసి ఎక్కువ గంటలు కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుందా? వారి మాటలు నిజమేనా? వారు చెప్పినట్లు అన్ని గంటలు పని చేస్తే మనిషి పై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? పని గంటలు పెరిగితే నిజంగా ఉత్పాదకత పెరుగుతుందా?

 

Also Read : చైనా నుంచి భారత్ కు భారీ ప్రమాదం పొంచి ఉందా? నీటితో యుద్ధానికి కాలు దువ్వుతోందా?