రావణుడి పుష్పక విమానం ఎక్కడకెళ్లింది … ఎక్కడ ల్యాండ్ అయ్యింది.. ఆకాశమార్గాలపై శ్రీలంక అన్వేషణ

వేల సంవత్సరాల క్రితం శ్రీలంకను రావణాసురుడు ఏలినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే రావణుడు అనేక గగన మార్గాల్లో విమాన ప్రయాణం చేసినట్లు కూడా కథలు ఉన్నాయి. అయితే రావణాసురుడు గగనతలంలో ఎక్కడెక్కడి వెళ్లారో ఆ రూట్లను అధ్యయనం చేయనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.శ్రీలంక విమానయానశాఖ దీనిపై పరిశోధన చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే రావణాసురుడికి సంబంధించిన సమాచారాన్ని తమకు ఇవ్వాలంటూ విమానయాన సంస్థ ప్రజలను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ ప్రటకన చేసింది. రావణాసురుడు ప్రయాణించిన ఆకాశమార్గాలపై తాము అన్వేషణ చేయనున్నామని, దానికి సంబంధించిన సమాచారం ఉంటే తమకు ఈవెయిల్, ఫోన్ చేయాలని శ్రీలంక విమానయాన శాఖ ఆ యాడ్‌లో తెలిపింది. రావణుడి విమానయానం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని క్రోడీకరించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు సివిల్ యేవియేషన్ అథారిటీ అధికారి ఒకరు తెలిపారు.
దండు మోనర అన్న ఓ ఎగిరే మెషీన్‌తో రావణాసురుడు గాలిలో విహరించినట్లు శ్రీలంకలో చెబుతుంటారు. తమ దేశంలోనే కాకుండా.. అనేక ఇతర ప్రాంతాల్లోనూ రావణాసురుడు దండు మోనర విమానంలోవిహరించినట్లు లంకేయులు భావిస్తుంటారు.
లంకాధీశుడైన రావణాసురుడిని సింహాలీ బౌద్దులు కీర్తిస్తారు. తమిళనాడులోని ద్రవిడ పార్టీ నేతలు కూడా రావణాసురిడిని స్తుతిస్తుంటారు. శ్రీలంకలోని సింహాలీ బౌద్ద గ్రూపు రావణ బాలాయ అన్న పేరు పెట్టుకున్నది. శ్రీలంక ప్రయోగించిన తొలి శాటిలైట్‌కు రావణ-1 అని పేరు పెట్టింది. ఆధునిక విమానాలకు రైట్ బ్రదర్స్ ఆద్యులు కానీ, లంకాధీశుడైన రావణాసురుడు విమానాలు నడిపినట్లు తాము భావిస్తామని ఆ దేశ మాజీ రవాణాశాఖ మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వా ఓ సందర్భంలో తెలిపారు.