అనుమానితుల ఫొటోలను తప్పుగా ప్రకటించిన శ్రీలంక

అనుమానితుల ఫొటోలను తప్పుగా ప్రకటించిన శ్రీలంక

Updated On : April 26, 2019 / 1:25 PM IST

ఈస్టర్ డే రోజున కొలంబోలో జరిగిన విషాదం యావత్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదానికి కారకులైన వారిని పట్టుకునే ప్రయత్నంలో శ్రీలంక ప్రభుత్వం పెద్ద పొరబాటు చేసింది. ఏప్రిల్ 25గురువారం అనుమానితులు అని పేర్కొంటూ ఆరుగురిని ఫొటోలతో పాటు పేర్లను కలిపి ప్రకటించిన లంక గవర్నమెంట్ అందులో ఒక మహిళ ఫొటోను తప్పుగా ప్రకటించింది. 
Also Read : ఎలక్షన్ అఫిడవిట్ : మోడీ ఆస్తులు ఎంతంటే?

350 మందికి పైగా ప్రజలను పొట్టనబెట్టుకున్న వారు వీళ్లేనని లంక ప్రభుత్వం విడుదల చేసిన అనుమానితుల ఫొటోల్లో.. అమెరికాకు చెందిన అమారా మజీద్ అనే మహిళ ఉంది. కానీ, అనుమానితుల జాబితాలో ఆమె పేరు అబ్దుల్ ఖాదర్ ఫాతిమి ఖదియా అని ప్రకటించారు. గురువారం విడుదల చేసిన జాబితాను శుక్రవారం ఉదయాన్నే గమనించిన అమారా మజీద్.. ఈ ఘోరాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితోనూ ప్రకటించింది. 

‘హల్లో ప్రతి ఒక్కరికీ.. ఈ రోజు ఉదయం శ్రీలంక ప్రభుత్వం ఈస్టర్ డే రోజున బాంబు అనుమానితుల పేర్లు ప్రకటించడంలో తప్పు చేసింది. ఇప్పటికే ముస్లిం వర్గాలు ఇలాంటి సంఘటనలతో చాలా చెడ్డపేరును మూటగట్టుకుంటున్నాయి. ఇటువంటి అసత్య ప్రచారాలు కొనసాగకూడదని ఆశిస్తున్నా’ అని ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించింది. 

ఆ అనుమానితుల జాబితాలో ఉన్న ఫొటో తప్పుగా ప్రకటించామని లంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. ఆమారా మజీద్ కుటుంబం శ్రీలంకకు చెందిన వారు. 2015లో ఇమ్మిగ్రేషన్ విషయంపై డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ కూడా రాశారు. 
Also Read : ట్రెండింగ్‌లో చిరు మనవరాలి ఫోటోలు