Srilanka President : పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి..సింగపూర్ వెళ్లిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజ‌ప‌క్సే(72) సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నారు. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే డిసెంబర్-12న శ్రీలంక పార్ల‌మెంట్‌ను వారం రోజుల పాటు సస్పెండ్(నిలిపేయ‌డం)

Srilanka President : పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి..సింగపూర్ వెళ్లిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

Srilanka President

Updated On : December 13, 2021 / 9:23 PM IST

Srilanka President :  శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజ‌ప‌క్సే(72) సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నారు. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే డిసెంబర్-12న శ్రీలంక పార్ల‌మెంట్‌ను వారం రోజుల పాటు సస్పెండ్(నిలిపేయ‌డం) చేసినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. హ‌ఠాత్తుగా సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిపోయారు గోటబయా రాజ‌ప‌క్సే. ఈ సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న ఆయ‌న షెడ్యూల్ లో లేకపోవడం గమనార్హం.

ఇక, అధ్యక్షుడు అకస్మాత్తుగా పార్లమెంట్ ను వారం రోజులు సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటన్నదానిపై శ్రీలంక ప్ర‌భుత్వం ఇంకా స్పందించ‌లేదు. అయితే దీనిపై అధికారులు అన‌ధికారికంగా స్పందించారు. సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న అనేది పూర్తిగా ఆయ‌న వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న అని తెలిపారు. అయితే ఆరోగ్య కార‌ణాల రీత్యానే ఆయ‌న సింగ‌పూర్‌కు వెళ్లిన‌ట్లు సమాచారం.

ALSO READ Omicron In UK : ఏప్రిల్ చివరినాటికి బ్రిటన్ లో 75వేల ఒమిక్రాన్ మరణాలు!