శ్రీలంక పోలీస్ చీఫ్ రాజీనామా

బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు.నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పోలీస్ చీఫ్, రక్షణ శాఖ సెక్రటరీని రాజీనామా చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.గురువారం రక్షణ శాఖ సెక్రటరీ హేమసిరి ఫెర్నాండో రాజీ నామా చేయగా శుక్రవారం పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు.ఆదివారం నుంచి శ్రీలంకలో వరుస బాంబ్ బ్లాస్ట్ ల కారణంగా ఇప్పటివరకు 253మంది చనిపోగా 500మంది పైగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.