Teacher-Student Love Story : అతనికి 22.. ఆమెకు 48.. క్లాస్ టీచర్‌ని పెళ్లాడిన స్టూడెంట్

అతనికి 22.. ఆమెకు 48.. ఆమె అతనికి చిన్ననాటి క్లాస్ టీచర్. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ప్రేమ కథను చదవండి.

Teacher-Student Love Story :  అతనికి 22.. ఆమెకు 48.. క్లాస్ టీచర్‌ని పెళ్లాడిన స్టూడెంట్

Teacher-Student Love Story

Updated On : May 14, 2023 / 4:19 PM IST

Student married a teacher : 22 ఏళ్ల మలేషియాకి చెందిన వ్యక్తికి 48 ఏళ్ల టీచర్‌కి పెళ్లి జరిగింది. వీరి ప్రేమ కథేంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు.

three children Mother absconding : ఇదో వింత ప్రేమకధ : 7వతరగతి కుర్రాడితో పారిపోయిన ముగ్గురు పిల్లల తల్లి

మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీకి 22 ఏళ్లు. అతని క్లాస్ టీచర్ జమీలాకి 48 ఏళ్లు. 2016లో అతను తను చదువుకున్న స్కూల్‌కి వెళ్లినపుడు క్లాస్ రూంలో ఆమెను కలిసాడు. తను చివరి సారి జమీలాను 4వ తరగతిలో ఉండగా చూసాడు. తనని గుర్తు చేస్తూ జమీలాను పలకరించాడు. ఇద్దరు కాంటాక్ట్స్ మార్చుకున్నారు.

 

అతని పుట్టినరోజుకి జమీలా ఫోన్‌లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేసింది. మొహమ్మద్ ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ విషయాన్ని ఆమెకు చెప్పేసాడు. వారిద్దరి మధ్య ఉన్న 26 సంవత్సరాల వయసు బేధం కారణంగా జమీలా అతడిని రిజెక్ట్ చేసింది. అహ్మద్ అలీ ఆమె ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. మాటలు కలిసి నెమ్మదిగా వారి మధ్య పెరిగిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

 

Bombay HC : ప్రేమించి..జాతకాలు కలవలేదని పెళ్లి చేసుకోనన్న యువకుడు..దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు

జమీలా అతని ప్రేమను అంగీకరించింది. 2019లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కోవిడ్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. 2021లో మొత్తానికి ఈ జంట ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్యలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. జమీలాకి 2007లో మొదటి భర్తతో విడాకులయ్యాయి. ప్రస్తుతం అహ్మద్ అలీ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని.. 26 సంవత్సరాల వయసు తేడా తమ ప్రేమకు అడ్డంకి కాలేదని ఈ జంట చెబుతున్నారు. వినడానికి విపరీతంగా అనిపిస్తున్నా ఈ ప్రేమ కథ మాత్రం వాస్తవం.