రాతిపై పురాతన కళకు ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

ఇండోనేషియాలో చాలా కాలం నాటికి బొమ్మలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిని 44 వేల సంవత్సరాల క్రితం నాటివిగా గుర్తించారు. సులవేసి ద్వీపంలో నివసిస్తున్న ప్రజలు ఆ గుహా గోడలపై కొమ్ములతో ఉన్న జంతువులు, పందుల చిత్రాలను గీసినట్లుగా నిర్ధారించారు.
అప్పట్లో యూరోపియన్ గుహ చిత్రకారులు ఆకర్షణీయమైన వన్య ప్రాణుల చిత్రాలను గోడలపై గీసేవారు. గేదె ఆకారాన్ని పోలి జంతువులపై దాడి చేసేలా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాతిపై ఇటువంటి కళలు చూడటం ఇదే మెుదటిసారి అని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంలోని పురావస్తు శాస్త్రవేత్త మాక్సిమ్ ఆబెర్ట్ చెప్పారు. మెుదటి సారి ఫోన్‌లో చూసినప్పుడు ఆశ్చర్యంగా, ఉత్సాహంగా అనిపించిందని మరో శాస్త్రవేత్త ఆడమ్ తెలిపారు.
సుమారు 35వేల నుండి 44వేల సంవత్సరాల క్రితం నాటివిగా కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో ప్రజలకు, జంతువులకు మధ్య సంబంధం గురించి తెలియచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఎన్నో పురాతన బొమ్మలు, ప్రాచీనమైన గుహలు కనుమరుగవుతున్నాయిని ఆడమ్, ఆబెర్ట్ తెలిపారు. వీటి ద్వారా తాము కనుగొన్న వాటిలో రాతి కళ ఒకటిగా నిలిచిపోతుందని వారి మాటల్లో వివరించారు.