Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్​ విచ్‌లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు

క్షణికావేశం, ఓ చిన్న పాటి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంతో ఊగిపోయిన కస్టమర్ గన్ తో కాల్పులు జరిపాడు. అసలేం జరిగిందంటే..

Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్​ విచ్‌లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు

Sandwich Shot Dead

Updated On : June 30, 2022 / 9:53 PM IST

Sandwich Shot Dead : అమెరికాలోని అట్లాంటాలో దారుణం జరిగింది. క్షణికావేశం, ఓ చిన్న పాటి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంతో ఊగిపోయిన కస్టమర్ గన్ తో కాల్పులు జరిపాడు. అసలేం జరిగిందంటే..

36ఏళ్ల వ్యక్తి అట్లాంటాలో సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లాడు. తనకు శాండ్ విచ్ కావాలని ఆర్డర్ చేశాడు. కాసేపటికి ఓ మహిళా సర్వర్.. శాండ్ విచ్ తెచ్చి అతడికి ఇచ్చింది. కానీ ఆ శాండ్ విచ్ లో మేయో (గుడ్డు సొన, నూనెలతో చేసే వెన్న వంటి క్రీమ్) చాలా ఎక్కువగా ఉందని ఆ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీని గురించి సర్వర్ తో వాదనకు దిగాడు.

Kidnapped Woman: కిడ్నాప్ చేసి మనిషి మాంసం తినమని మహిళకు బలవంతం

మహిళా సర్వర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. ఇంతలో మరో మహిళా సర్వర్ అక్కడికి వచ్చి ఆమె కూడా సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే తీవ్ర ఉన్మాదంలోకి వెళ్లిపోయిన కస్టమర్.. తన దగ్గరున్న గన్ బయటక తీసి ఇద్దరు మహిళా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. దీంతో 26 ఏళ్ల మహిళా సర్వర్ స్పాట్ లోనే చనిపోగా.. మరో 24 ఏళ్ల మహిళా సర్వర్ తీవ్రంగా గాయపడింది.

చనిపోయిన మహిళా సర్వర్ ఐదేళ్ల కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. అతడి కళ్ల ముందే తల్లి చనిపోవడం అందరినీ విషాదంలో ముంచింది. రెస్టారెంట్ యజమాని సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. ఈ దుర్మార్గానికి పాల్పడ్డ కస్టమర్ ను అరెస్టు చేశారు.

Handy Husband: మూడున్నర వేలకు భర్తను అద్దెకిస్తున్న భార్య

ఈ ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. శాండ్ విచ్ లో మేయో ఎక్కువైందంటూ గొడవకు దిగి కాల్పులు జరపడం దారుణం అంటున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw