Sunita Williams : మళ్లీ ‘స్పేస్‌వాక్’ చేసిన సునీతా విలియమ్స్.. 8 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం బయటకు!
Sunita Williams : గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు.

Sunita Williams, Butch Wilmore finally step outside
Sunita Williams : అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి, కమాండర్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కలిసి మరోసారి స్పేస్‌వాక్ నిర్వహించారు. సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. 8 నెలల తర్వాత సునీతా, విల్మోర్‌తో కలిసి రెండోసారి అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఇద్దరు వ్యోమగాములు కలిసి శూన్యంలో వాక్ చేశారు.
2024 జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో ‘ఐఎస్‌ఎస్’కు సునీత విలియమ్స్, విల్‌మోర్ వెళ్లిన సంగతి తెలిసిందే. 8 రోజుల మిషన్‌లో భాగంగా వీరిద్దరూ అంతరిక్షానికి పయనమయ్యారు. షెడ్యూల్ ప్రకారం.. అదే నెల 14న ఇరువురు వ్యోమగాములు భూమికి తిరిగి రావాల్సి ఉండగా, అనూహ్య పరిణామాలతో వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తి వారిద్దరూ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
విల్మోర్‌తో కలిసి స్పేస్‌వాక్ :
రెండు వారాల క్రితమే విలియమ్స్ మరో నాసా వ్యోమగామితో కలిసి స్పేస్‌వాక్ చేసింది. ఇందులో మొదటిసారిగా అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చారు. మునుపటి స్పేస్ స్టేషన్ బస సమయంలో ఇద్దరూ స్పేస్‌వాక్ చేశారు.
స్టేషన్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీతా విలయమ్స్.. నాసాకు చెందిన మరో వ్యోమగామితో ఐఎస్‌ఎస్‌లో మరమ్మతు పనులు చేయనుంది. 2012లో సునీతా చివరిసారిగా స్పేస్‌వాక్ చేయగా, ఇటీవల 8వసారి ఆమె స్పేస్ వాక్ చేశారు. తాజాగా ఇప్పుడు అంతరిక్షం బయట మళ్లీ స్పేస్‌వాక్ చేశారు.
LIVE: @NASA_Astronauts Suni Williams and Butch Wilmore are taking a spacewalk to maintain @Space_Station hardware and collect samples. Today’s spacewalk is scheduled to start at 8am ET (1300 UTC) and go for about 6.5 hours. https://t.co/6pvzcwPdgs
— NASA (@NASA) January 30, 2025
“నాసా, స్పేస్‌ఎక్స్ ఏజెన్సీకి చెందిన స్పేస్‌ఎక్స్ క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను త్వరగా భూమికి తిరిగి తీసుకురావడానికి వేగంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో క్రూ -10 ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నాయని నాసా ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఇద్దరు నాసా వ్యోమగాములను తిరిగి రప్పించాలని ఎలోన్ మస్క్, స్పేస్‌ఎక్స్‌ని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు :
సునీతా విలియమ్స్, విల్మోర్ ఇద్దరూ జూన్‌లో అంతరిక్షంలో ఒక వారం తర్వాత భూమికి తిరిగి వస్తారని భావించారు. కానీ వారి అంతరిక్ష నౌక, బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్, అనేక సమస్యలను ఎదుర్కొంది. దాంతో నాసా ఖాళీగా తిరిగి పంపాలని నిర్ణయించుకుంది. స్పేస్ఎక్స్ (SpaceX) వీరిద్దరిని సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి మరో అంతరిక్ష నౌకను పంపే వరకు రెండు పరీక్షలను కక్ష్యలో ఉంచింది.
Read Also : Budget 2025 : మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పొడిగిస్తారా? ఫిబ్రవరి 1న బడ్జెట్‌పైనే గంపెడు ఆశలన్నీ..!
వారిని భూమిపైకి తీసుకురావడంలో స్పేస్ఎక్స్ జాప్యం కారణంగా వారి మిషన్‌ను 10 నెలలకు పొడిగించింది. మరికొన్ని నెలలు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ఆరంభంలో సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది.