శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనపై స్పందించిన సుష్మాస్వరాజ్ 

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 07:17 AM IST
శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనపై స్పందించిన సుష్మాస్వరాజ్ 

Updated On : April 21, 2019 / 7:17 AM IST

శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. కొలంబోలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కొలంబోలో నెలకొన్న పిరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు. 

శ్రీలంకలోని వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని ఐదు చర్చీలు, రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ లో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ వేడుకల్లో ఘటన చేసుకుంది. ఈ ఘటనలో 160 మందికిపైగా మృతి చెందారు. మరో 500 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

కొలంబోలోని కొచ్చికోడ్‌ ప్రాంతంలో ప్రముఖ సెయింట్‌ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలోనూ పేలుళ్లు సంభవించాయి. అలాగే శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు చర్చిలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. క్షతగాత్రలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో విదేశీ టూరిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.