China-Taiwan : మరోసారి తైవాన్ గగనతంలోకి భారీగా చైనా యుద్ధ విమానాలు

అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల హెచ్చరికల తర్వాత కూడా తైవాన్‌ ను భయపెట్టడం చైనా ఆపడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి

China-Taiwan : మరోసారి తైవాన్ గగనతంలోకి భారీగా చైనా యుద్ధ విమానాలు

Planes

Updated On : October 3, 2021 / 4:25 PM IST

China-Taiwan అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల హెచ్చరికల తర్వాత కూడా తైవాన్‌ ను భయపెట్టడం చైనా ఆపడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా  చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి చొచ్చుకు వస్తున్నాయని తాజాగా తైవాన్‌ ఆరోపించింది. వరుసగా రెండో రోజు…శనివారం మొత్తం 39 చైనా మిలటీరీ విమానాలు తమ ఢిఫెన్స్ జోన్ లోకి చొచ్చుకువచ్చాయని తైవాన్​ ఆరోపించింది. శనివారం ఉదయం 20 విమానాలు ప్రవేశించగా.. సాయంత్రం వేళ మరో 19 విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంతకుముందు శుక్రవారం కూడా ఇదే తరహాలో అణుబాంబులు జారవిడిచే సామర్థ్యం ఉన్న రెండు హెచ్‌-6 బాంబర్లతో సహా 38 చైనా విమానాలు ప్రవేశించినట్లు తైవాన్ రక్షణశాఖ తెలిపింది. శుక్రవారం(అక్టోబర్-1,2021)చైనా తమ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా 38 ఫైటర్ జెట్లతో ప్రదర్శనలు నిర్వహించింది. ఈ జెట్‌ లు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించాయి. చైనీస్ జెట్‌ల ఫ్లైట్ రూట్ మ్యాప్‌ను కూడా తైవాన్‌ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం, చైనీస్ జెట్‌ల మొదటి బృందం ప్రతాస్ ద్వీపం ప్రాంతం గుండా వెళ్ళగా.. రెండవ బృందం బాషి ఛానల్ మీదుగా వెళ్లింది. ఈ ఛానెల్ తైవాన్‌ను ఫిలిప్పీన్స్ నుంచి వేరు చేస్తుంది.

చైనా విమానాలను పర్యవేక్షించేందుకు తైవాన్ క్షిపణి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. తైవాన్ నైరుతిలో చైనా చొరబాట్ల గురించి తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా చైనీస్ ఎయిర్ ఫోర్స్ చొరబాటుపై తైవాన్‌ ఫిర్యాదు చేస్తున్నది. అయితే, ఈ విషయంలో చైనా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. తైవాన్‌పై పూర్తి స్వయంప్రతిపత్తిని చైనా ప్రకటించింది. చైనా వాదనను తైవాన్ తిరస్కరిస్తున్నది. ఈ కారణంగా చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి తైవాన్‌పై చైనా సైనిక, రాజకీయ ఒత్తిడిని పెంచుతున్నది.

కాగా, చైనా యుద్ధవిమానాలు తమ గగనతలంలోకి ఈ స్థాయిలో చొచ్చుకురావడం మునుపెన్నడూ జరగలేదని తైవాన్ తెలిపింది. చైనా ఎల్లప్పుడూ దారుణమైన, అనాగరికమైన చర్యలకు పాల్పడుతూ, ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తోందని తైవాన్​ ప్రధాని సు సెంగ్-చాంగ్​ ఆరోపించారు. దక్షిణ తైవాన్​లో ఓ సైన్స్​పార్క్​ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా విమానాలను పర్యవేక్షించేందుకు తైవాన్ క్షిపణి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది.

అయితే, గత ఏడాది కాలంగా చైనీస్ ఎయిర్ ఫోర్స్ చొరబాటుపై తైవాన్‌ ఫిర్యాదు చేస్తోంది. అయితే, ఈ విషయంలో చైనా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. తైవాన్‌పై పూర్తి స్వయంప్రతిపత్తిని చైనా ప్రకటించింది. చైనా వాదనను తైవాన్ తిరస్కరిస్తోంది. ఈ కారణంగా చైనా తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి తైవాన్‌ పై సైనిక, రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది.

చైనా-తైవాన్..ముఖ్య విషయాలు
చైనా-తైవాన్ సంబంధాలు
దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్.  1940ల్లో జరిగిన సివిల్ వార్ సమయంలో చైనా-తైవాన్ లు విడిపోయాయి. అయితే ఏదోఒకరోజు అవసరమైతే ఒలవంతంగానైనా తైవాన్ ను మళ్లీ పూర్తీగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని చైనా చెబుతోంది. తైవాన్‌ను తనలో శాంతియుతంగా కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ తైవాన్ ప్రజలు, ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు.

తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది. అది స్వతంత్ర రాజ్యంలానే కనిపిస్తున్నా, అధికారికంగా చైనా నుంచి దానికి స్వతంత్రం లభించలేదు. చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం కారణంగా నిత్యం రెండు దేశాల మధ్య హింస చెలరేగే ప్రమాదం పొంచే ఉంటుంది. ఆ వివాదంలో అమెరికా కూడా కల్పించుకునే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇక,1980లో చైనీ-తైవాన్ మధ్య సంబంధాలు కొంచెం మెరుగుపడ్డాయి. ఇందులో భాగంగానే ‘ఒక దేశం- రెండు వ్యవస్థల’ సూత్రాన్ని చైనా తీసుకొచ్చింది. చైనాతో మళ్లీ కలిసిపోవడానికి తైవాన్ ఒప్పుకుంటే, ఆ ద్వీపానికి పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చైనా చేసిన ప్రతిపాదనకు తైవాన్ అంగీకరించలేదు.

తైవాన్ ను ఎవరు గుర్తిస్తున్నారు?
కేవలం కొన్ని దేశాలు మాత్రమే తైవాన్ ను ఓ దేశంగా గుర్తిచాయి. అగ్రరాజ్యం అమెరికాకు తైవాన్‌తో అధికారిక సంబంధాలు లేవు కానీ ఆ దేశానికి తనను తాను రక్షించుకునే మార్గాలను అందించే చట్టాన్ని కలిగి ఉంది.

అసలు వివాదం ఎలా మొదలైంది?

తైవాన్ లో మొదట చైనా నుంచి వలస వెళ్లిన “ఆస్ట్రోనేసియన్” గిరిజన ప్రజలు స్థిరపడినట్లు భావిస్తున్నారు.  క్రీ.శ.239లో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్‌ను మొదట గుర్తించినట్లు చైనా రికార్డులను చూపెడుతోంది. ఆ కారణంగానే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తుంది. 1624-1661 మధ్య డచ్ పాలకుల అధీనంలో ఉన్న తైవాన్, ఆ తర్వాత 200 ఏళ్లకు పైగా(1683-1895) చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలోనే కొనసాగింది. 17వ శతాబ్దం మొదట్లో చైనాలోని కఠిన పరిస్థితులను తాళలేక ప్రధానంగా ఫూజియన్, గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రాల ప్రజలు తైవాన్‌ కు పెద్ద సంఖ్యలో సంఖ్యలో వలస వెళ్లారు. ప్రస్తుతం తైవాన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువ మంది ఆ రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన వారి వారసులే.

1895లో మొదటి సైనో-జాపనీస్ యుద్ధంలో క్వింగ్‌ ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో తైవాన్.. జపాన్ అధీనంలోకి వెళ్లిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తైవాన్‌ పై నియంత్రణను జపాన్ వదులుకుంది. అమెరికా, బ్రిటన్ దేశాల అనుమతితో తైవాన్‌ను మళ్లీ చైనా పాలించడం మొదలుపెట్టింది. కానీ, ఆ తర్వాత కొన్నేళ్లకే చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి చైనా నాయకుడు షియాంగ్ కై-షెక్ బలగాలను మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు బలగాలు చిత్తు చేశాయి. దాంతో 1949లో షియాంగ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న దాదాపు 15లక్షల మంది ప్రజలు తైవాన్‌కు వెళ్లిపోయారు. తైవాన్ జనాభాలో వాళ్ల సంఖ్య 14శాతమే అయినా, చాలా ఏళ్ల పాటు వాళ్లే అక్కడి రాజకీయాలను శాసించారు. చనిపోయేవరకు షియాంగ్‌ తైవాన్‌ను పాలించాడు. ఆ తరువాత షియాంగ్ కొడుకు షియాంగ్ చింగ్-కో అధికారం చేపట్టాడు. కానీ, తైవాన్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆయన 2000 సంవత్సరంలో ఎన్నికలకు అనుమతిచ్చాడు. అలా తైవాన్‌లో తొలిసారి షియాంగ్ కుటుంబ పాలన ముగిసింది.

తైవాన్ లో ఇప్పుడు ప్రభుత్వం ఎలా నిర్వహించబడుతోంది?
తైవాన్ కు సొంత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నేతలు ఉన్నారు. తైవాన్ సాయుధ బలగాల్లో.. 3లక్షల యాక్టివ్ ట్రూప్స్ ఉన్నాయి.

ALSO READ బంపర్ మెజారిటీతో గెలిచిన మమతా బెనర్జీ