Kabul: అఫ్ఘాన్ లో పాకిస్తాన్ వ్యతిరేక ర్యాలీ.. కాల్పులు జరిపిన తాలిబన్లు
అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో పాకిస్తాన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం కాబూల్‌లో యాంటీ-పాకిస్తాన్ ర్యాలీ జరిగింది.

Kabul
Kabul అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో పాకిస్తాన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం కాబూల్‌లో యాంటీ-పాకిస్తాన్ ర్యాలీ జరిగింది. దాదాపు 70 మంది(ఎక్కువగా మహిళలు) అఫ్ఘాన్ లు కాబుల్ లోని పాకిస్తాన్ ఎంబసీ బయట నిరసన ప్రదర్శన చేపట్టారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. తమ దేశంలో వ్యవహారాల్లో పాకిస్తాన్ పెత్తనాన్ని సహించేదిలేదని నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. యాంటీ పాకిస్తాన్ ర్యాలీని చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
కాగా,అఫ్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమైన తాలిబన్లను ప్రభావితం చేసే బయటి శక్తి పాకిస్తాన్ అనే విషయం తెలిసిందే. తాలిబన్ నేతల ప్రధాన కార్యాలయం పాకిస్తాన్ లోనే ఉంది. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ- ఐఎస్ఐతో తాలిబన్లకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి తాలిబన్లకు సైనిక సాయం అందుతోందని అమెరికా, అఫ్ఘానిస్తాన్ గత ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే.
మరోవైపు,పాకిస్తాన్ గూఢచర్య సంస్థ- ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ జనరల్ ఫయీజ్ హమీద్ శనివారం అకస్మాత్తుగా అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో పర్యటించారు. జనరల్ ఫయీజ్ పర్యటనకు కారణాలేమిటో తెలియరాలేదు.
పంజ్‌షీర్ లోయలో తాలిబన్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతోపాటు పాకిస్తాన్ అధికారుల బృందం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం…పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ భవిష్యత్తుపై చర్చించేందుకు రావాలని తాలిబన్లు కోరడంతో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
READ Panjshir : అప్ఘాన్ లకు అండగా పంజ్ షిర్;..ఆయన పేరు వింటేనే తాలిబన్లకు వణుకు
READ Haqqani Network : ముల్లా బరాదర్-హక్కానీ నెట్ వర్క్ మధ్య విభేదాలు..తాలిబన్లలో పాక్ ఆత్మ