Taliban : అప్ఘాన్‌‌లో బహిరంగ శిక్షలు, కాల్చి చంపి..క్రేన్లకు వేలాడదీశారు

అప్ఘాన్ లో తాలిబన్లు చెప్పినట్లు చేస్తున్నారు. బహిరంగ శిక్షలు అమలు చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఇటీవలే తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Taliban : అప్ఘాన్‌‌లో బహిరంగ శిక్షలు, కాల్చి చంపి..క్రేన్లకు వేలాడదీశారు

Taliban

Updated On : September 25, 2021 / 5:26 PM IST

Taliban Hang Dead Body : అప్ఘాన్ లో తాలిబన్లు చెప్పినట్లు చేస్తున్నారు. బహిరంగ శిక్షలు అమలు చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఇటీవలే తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే అనుకున్నంత పని చేశారు. హెరాత్ నగరంలో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురిని తాలిబన్లు కాల్చి చంపేశారు. అంతేగాకుండా..క్రేన్ల సహాయంతో వీరిని బహిరంగంగా వేలాడదీశారు. ప్రధాన కూడళ్లలో వీరిని వేలాడదీయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Read More : SP Balasubrahmanyam : బాలును వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు..

దాదాపు 20 ఏళ్ల తర్వాత…అప్ఘాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం తాము గతంలోగా ఉండమని, ప్రజా పాలన చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ ఉత్తుత్తివే అని తేలిపోయాయి. మహిళల విషయంలో అరాచకం సృష్టిస్తున్నారు. కఠిన నియమ, నిబంధనలు అమలు చేస్తున్నారు. తాలిబన్ల పాలన అంటేనే..వెన్నులో వణుకు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. బహిరంగంగా శిక్షిస్తున్నారు. స్తంభాలకు కట్టేసి..చావ చితకబాదుతున్నారు. ప్రజలు అందరూ గుమికూడగా…ఓ వ్యక్తిని చేతులు కట్టేసి..ఒక్కొక్కరు దాడి చేస్తున్న దృశ్యాలు ఒళ్లుగొగురుపొడుస్తున్నాయి. ఒకప్పటి క్రూర విధానాలు తిరిగి అక్కడ అమలవుతున్నాయి.

Read More : Sneha Dubey : పాకిస్థాన్..!అబద్దాలు ఇక చాలు..ఆక్రమిత ప్రాంతాలు వదిలివెళ్లు :యూఎన్ లో స్నేహా దూబే వార్నింగ్

1990 నాటి తరహాలో ఇప్పుడు కాళ్లు, చేతులు నరకడం, కళ్లు పెరికివేయడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని చెప్పి తమ నిజస్వరూపం ఏంటో చెప్పారు. అప్ఘాన్ లో హంతకులను బహిరంగంగా కాల్చడం, దొంగల కాళ్లు, చేతులు నరకడం వంటి శిక్ష అమల్లో ఉండేవి. రానున్న రోజుల్లో అప్ఘాన్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న సర్వత్రా ఆందోళన నెలకొంది.