Taliban : అప్ఘాన్‌లో తాలిబన్ల రాక్షసపాలన.. పెళ్లిలో మ్యూజిక్ ఆపేందుకు 13 మంది ఊచకోత!

అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాక్షస పాలన కొనసాగుతోంది. పెళ్లిలో మ్యూజిక్‌ బంద్‌ చేయించేందుకు ఏకంగా 13 మందిని దారుణంగా చంపేశారు.

Taliban : అప్ఘాన్‌లో తాలిబన్ల రాక్షసపాలన.. పెళ్లిలో మ్యూజిక్ ఆపేందుకు 13 మంది ఊచకోత!

Taliban Killed 13 To Silence Music At A Wedding Party In Nangarhar

Updated On : October 30, 2021 / 10:04 PM IST

Taliban silence music in wedding party : అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాక్షస పాలన కొనసాగుతోంది. అప్ఘాన్ ఆక్రమణ తర్వాత అక్కడి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్ఘాన్‌లో తాలిబన్ల పాలనలో ఆర్థిక మాంద్యం పెరిగిపోయింది. తాలిబన్ల దుశ్చర్యలు మాత్రం ఆగడం లేదు. కొన్ని రోజుల క్రితం తాలిబన్లు ఓ మహిళా క్రీడాకారిణి తల నరికిన ఘటన మరవకముందే మరో ఊచకోత చర్యకు పాల్పడ్డారు. పెళ్లిలో మ్యూజిక్‌ బంద్‌ చేయించేందుకు ఏకంగా 13 మందిని దారుణంగా చంపేశారు.

ఈ విషయాన్ని అప్ఘాన్ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేహ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అమ్రుల్లా ప్రకారం.. నంగర్‌హార్ ప్రావిన్స్‌ (Nangarhar province)లో పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి సందర్భంగా అక్కడి సందడి వాతావరణం నెలకొంది. పెళ్లి మండపం దగ్గర మ్యూజిక్, డీజే పెట్టించారు. అది తెలిసిన తాలిబన్లు ఆగ్రహించారు.


మ్యూజిక్‌ ఆపమంటూ హెచ్చరికలు చేయలేదు. అమానుషంగా పెళ్లి వేడుకల్లో పాల్గొన్న 13 మందిని ఊచకోత కోశారు తాలిబన్‌ మిలిటెంట్లు. మన సంస్కృతిని చంపేసేందుకు పాక్ వీరికి దాదాపు 25 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చిందని, మన సంస్కృతి స్థానంలో ఐఎస్‌ఐ కల్చర్‌ని తీసుకువచ్చారని, మన ఆత్మలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారని అమ్రుల్లా ట్వీట్ చేశారు.


ఈ రాక్షస పాలన ఎంతో కాలం కొనసాగదని పేర్కొన్నారు. అప్పటివరకూ అప్ఘాన్లు మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ ట్వీట్‌ చేశారు. అప్ఘాన్ ఆక్రమణ నాటి నుంచి తాలిబన్లు దేశంలో కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. మ్యూజిక్‌, టీవీల్లో ఆడవారి గొంతు వినిపించరాదంటూ నిషేధం విధించారు.