Elon Musk : చైనాతో మనకొద్దు ప్లీజ్.. ఆ టారిఫ్స్ వెనక్కి తీసుకోండి.. ట్రంప్‌‌కు మస్క్ రిక్వెస్ట్..!

Elon Musk : వాణిజ్య విషయంలో ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి కాదు. 2020లో మస్క్ ట్రంప్ పరిపాలనపై సుంకాన్ని సవాలు చేస్తూ దావా వేసినప్పుడు ఇద్దరి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Elon Musk : చైనాతో మనకొద్దు ప్లీజ్.. ఆ టారిఫ్స్ వెనక్కి తీసుకోండి.. ట్రంప్‌‌కు మస్క్ రిక్వెస్ట్..!

Elon Musk

Updated On : April 8, 2025 / 6:23 PM IST

Elon Musk : చైనా దిగుమతులపై విధించిన కొత్త సుంకాలను వెనక్కి తీసుకోవాలని ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వ్యక్తిగతంగా కోరినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

చైనా వస్తువులపై 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ప్రపంచ బిలియనీర్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. కొత్త టారిఫ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని స్వయంగా ట్రంప్‌‌కు మస్క్ విజ్ఞప్తి చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Read Also : Elon Musk Net Worth : ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు టెస్లా షేర్లు భారీగా పతనం.. ఒక్కరోజే రూ.38వేల కోట్లు నష్టపోయిన ఎలన్ మస్క్..!

ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే దానిపై అమెరికా 50 శాతం అదనపు సుంకాన్ని విధిస్తామని చైనాను అమెరికా హెచ్చరించింది. అమెరికా ఈ ప్రకటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం జరిగే అవకాశాలు మరోసారి పెరిగాయి.

అమెరికా తాజా ప్రకటనకు వ్యతిరేకంగా మస్క్ సైతం తన స్వరాన్ని పెంచారు. టారిఫ్ పెంపును ఆపేందుకు మస్క్ ట్రంప్‌తో నేరుగా చర్చలు జరిపినట్లు నివేదికలు సూచించాయి. అయితే, మస్క్ ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి.

మస్క్ పోరాటం మొదటిసారి కాదు  :
వాణిజ్య విషయంలో ఎలన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి కాదు. 2020లో మస్క్ ట్రంప్ విధించిన సుంకాన్ని సవాలు చేస్తూ దావా వేసినప్పుడు ఇద్దరి మధ్య ఉద్రిక్తత కూడా నెలకొంది. సుంకాలకు వ్యతిరేకంగా మస్క్ పోరాటం చాలా ఏళ్ల నాటిది.

2020లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న భాగాలపై సుంకాలకు సంబంధించి టెస్లా ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసింది. ప్రారంభంలో మస్క్ ఈ విధానాన్ని అన్యాయమని పేర్కొంటూ దావాకు మద్దతు ఇచ్చాడు. అయితే, చైనాతో పొత్తు పెట్టుకున్నట్లు కనిపించవచ్చని భయపడి మస్క్ సందేహించినట్టు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

ట్రంప్ కొత్త విధానానికి మస్క్ మద్దతు :
ఎలన్ మస్క్ కూడా మొదట్లో ట్రంప్ కొత్త టారిఫ్ విధానాన్ని సమర్థించాడు. కానీ, ఆ తరువాత మస్క్ టారిఫ్ దుష్ప్రభావాలను చూసిన తర్వాత తీవ్రంగా వ్యతిరేకించాడు. మస్క్‌కు సన్నిహితుడైన ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో మస్క్ వ్యాపార భాగస్వాములు కూడా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

చాలా మంది తమ సందేశాన్ని రాష్ట్రపతికి తెలియజేయమని ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోని ప్రముఖ వ్యాపార నాయకుల బృందం ఒకరు అనధికారిక కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also : iPhone 16 Pro : ఈ కొత్త ఆపిల్ ఐఫోన్ చాలా చీప్ గురూ.. తక్కువ ధరకే కొనేసుకోండి.. లిమిటెడ్ ఆఫర్..!

టెస్లా షేర్లు భారీగా పతనం :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కొత్త టారిఫ్ విధానంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికన్ స్టాక్ మార్కెట్‌పై భారీ ప్రభావం కనిపించింది.

ముఖ్యంగా ట్రంప్ నిర్ణయంతో ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్లలో భారీ క్షీణతకు దారితీసింది. టెస్లా స్టాక్ 2.5 శాతానికి పైగా పడిపోయి 233.29 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ విలువ 38 శాతానికి పైగా పడిపోయింది.