లాక్‌డౌన్ మీలోనూ ఈ మానసిక సమస్యలు తెచ్చిందా.. చెక్ చేసుకోండి

మార్చి నుంచి లాక్‌డౌన్ రెండు నెలల పాటు ఇంట్లోనే పని. వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడిన వారు ఆఫీసులుకు వెళ్లి మళ్లీ నార్మల్ జీవితాన్ని గడపగలరా.. పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా కష్టమైపోతుంది. సైకియాట్రిక్ కండిషన్ కారణంగా అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్ అనేది రావొచ్చు. సూపర్ డ్రగ్ వారు చేసిన రీసెర్చ్ లో చాలా మంది నార్మల్ అవడానికి స్ట్రగుల్ అవుతున్నట్లు తేలింది.
3వేల మంది కస్టమర్లపై సర్వే నిర్వహించగా 22శాతం మందిలో గుంపులో ఉన్నప్పుడు ఆత్రుతతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 21శాతం మంది సమాజంలో కలవడానికి ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నారు. 43శాతం మంది నిబంధనలు ఎత్తేయడంతో భయపడిపోతున్నట్లుగా తెలిసింది. మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో అందరిలోనూ విపరీతమైన ఒత్తిడి కనిపించింది.
ఇది కొవిడ్ 19 కారణంగా వారి ఉద్యోగాలు పోయి ఆర్థిక పరిస్థితి మీద ఎఫెక్ట్ అవుతుందేమోననే అనుమానం వల్ల కూడా అయి ఉండొచ్చు. మానసిక ఆరోగ్యంపై ఈ సమయంలో చాలా ఎఫెక్ట్ కనిపించింది. రీసెర్చర్స్ ప్రజల మానసిక ఆరోగ్యాలపై పెద్ద తుఫాన్ నే తెచ్చిపెట్టిందని అన్నారు. అసలు మనలోనూ ఈ సమస్య ఉందా అని ఎలా తెలుసుకోవాలి. అంటే ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి.
1. ఆతురతగా అనిపించడం
మీలో కారణం లేకుండానే ఆతురతగా అనిపిస్తుందంటే లాక్ డౌన్ అడ్జస్ట్ మెంట్ డిజార్డర్ ఉన్నట్లే. ఇటీవలి నిబంధనలు, నియమాలు డిజార్డర్ కు కారణాలు అయి ఉండొచ్చు. పరిసరాలను త్వరగా ఇముడ్చుకోలేకపోవడం మెంటల్ హెల్త్ పై ప్రభావం చూపించి ఇలాంటి సమస్యలకు దారితీయొచ్చు.
2. కష్టపడి పనిచేయాల్సి రావడం
వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చేస్తున్న పనే. అయినా మనం ఏదైనా పని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుందంటే మనకు డిజార్డర్ ఉన్నట్లే. పరిధి దాటి మనుషులతో కలుస్తుండటం. సోషల్ ఇంటరాక్షన్ పెంచుకోవడం, మానసిక ఆరోగ్యం అవగాహన పెంచుకోవడం వంటివి మెంటల్ హెల్త్ ను ఇంప్రూవ్ చేయొచ్చు.
3. చుట్టు పక్క ప్రాంతాలతో ఇబ్బంది పడడం.
చుట్టూ ఉన్న వారితో కలుసుకునేందుకు ఇబ్బందిపడతుండటం వైరస్ నుంచి కాపాడుకోవడానికి వచ్చినదే కావొచ్చు. మీ స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండటం కూడా దీనికి ఓ కారణం.
మనుషుల మధ్య దూరం పెంచుకుని మానసిక ఆరోగ్యాన్ని ప్రమాదాల్లోకి నెట్టొద్దని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ అనేది రిస్క్ తో కూడిన వ్యవహారమైనప్పటికీ భౌతిక దూరం పాటిస్తూ పలకరింపులు అనేవి అప్పుడప్పుడూ జరుగుతుండాలని నిపుణులు చెబుతున్నారు.