Python : భారీ కొండచిలువను అమాంతం ఎత్తేసిన క్రేన్..వీడియో వైరల్
భారీ సైజులో ఉన్న కొండచిలువను క్రేన్ అమాంతం ఎత్తేసిన వీడియో గత వారం రోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో ఎక్కడిదన్న ఆసక్తి మొదలైంది.

Petrol (1)
crane lifted the huge python : భారీ కొండచిలువను క్రేన్ అమాంతం ఎత్తేసిన వీడియో వారం రోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ‘‘7కొండల్లో 32అడుగుల కొండచిలువ. తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుంటే 32 అడుగుల కొండచిలువ కనబడింది’’.. అంటూ ఫేస్‌బుక్‌లో కొందరి అకౌంట్ల నుంచి ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారం ఫేక్ అని తెలిసిందే.
వివరాల్లోకి వెళ్తే..భారీ సైజులో ఉన్న కొండచిలువను క్రేన్ అమాంతం ఎత్తేసిన వీడియో గత వారం రోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో ఎక్కడిదన్న ఆసక్తి మొదలైంది. అయితే తాజా వీడియో మాత్రం మన దేశంలోనిది కాదన్న విషయం వెలుగు చూసింది. వీడియో ఇమేజ్ ద్వారా రివర్స్ చెక్ ఆప్షన్‌తో ఈ వీడియోకు సంబంధించి కొన్ని వివరాలు సేకరించాం.
Bangladesh communal violence: దుర్గా పూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తి ఇతనే
అక్టోబర్ 12న ‘టమన్ పెండిడికన్’ అనే వెబ్‌సైట్ ద్వారా ఈ వీడియో గురించి మొదటి పోస్ట్ పడింది. అయితే పోస్ట్‌లోని భాష ఆధారంగా ఆ వెబ్‌సైట్ ఇండోనేషియన్ వెబ్‌సైట్‌గా నిర్ధారణ అయ్యింది. అదేరోజు ఓ ఇండోనేషియన్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ అయ్యింది. ఆ తర్వాత ఇది ఇండోనేషియాకు చెందినది కాదని.. మలేషియాకు సంబంధించిన వీడియో అని ప్రచారం మొదలైంది.
ఆ వెంటనే ఈ భారీ కొండచిలువ చైనా-మయన్మార్ బార్డర్‌లో దొరికిందని, కాదు.. మేఘాలయాకు చెందినది అని, కాదు.. ఈ వీడియో జార్ఖండ్ ధన్‌బాద్(భారత్)లోనిదేనంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే కొన్ని హిందీ వెబ్‌సైట్లు ఇది అసలు మన దేశంలో కాదనే విషయాన్ని ఫ్యాక్ట్‌చెక్ ద్వారా నిర్ధారణ చేశాయి. అసలు ఇంతకీ ఈ వీడియో కొత్తదేనా? లేదంటే పాతదా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది.
Facebook: ఫేస్‌బుక్ నిర్లక్ష్యానికి రూ.515 కోట్లు జరిమానా
ఏది ఏమైనప్పటికీ గతంలో ఇలా భారీ పాములు కనిపించిన సందర్భాల్లో చంపిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆ భారీ పామును ప్రాణాలతో ఉంచారా? అని జంతు పరిరక్షణ సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్ స్టేటస్‌లతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తోంది.