Harvard University Claudine Gay : హార్వర్డ్ యూనివర్సిటీ కొత్త ప్రెసిడెంట్ గా తొలిసారి నల్లజాతీయురాలు నియామకం

హార్వర్డ్ యూనివర్సిటీ కొత్త ప్రెసిడెంట్ గా తొలిసారి నల్లజాతీయురాలును నియమించారు. ఆఫ్రికన్ అమెరికన్ అయిన క్లాడిన్ గే ను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో అత్యున్నత పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతీయురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు.

Harvard University Claudine Gay : హార్వర్డ్ యూనివర్సిటీ కొత్త ప్రెసిడెంట్ గా తొలిసారి నల్లజాతీయురాలు నియామకం

Claudine Gay

Updated On : December 16, 2022 / 12:35 PM IST

Harvard University Claudine Gay : హార్వర్డ్ యూనివర్సిటీ కొత్త ప్రెసిడెంట్ గా తొలిసారి నల్లజాతీయురాలును నియమించారు. ఆఫ్రికన్ అమెరికన్ అయిన క్లాడిన్ గే ను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో అత్యున్నత పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతీయురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు.

హైతీ వలసదారుల కుమార్తె అయిన క్లాడిన్ గే(52) వచ్చే ఏడాది జులై1న ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతేకుండా మసాచుసెట్స్ లో ఉన్న కేంబ్రిడ్జీ స్కూల్ కు అధిపతిగా ఎన్నికైన రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

Harvard Professor: మనుషులంతా ఏలియన్లు చేసిన ప్రయోగమే.. – హార్వర్డ్ ప్రొఫెసర్

ప్రస్తుతం యూవర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ డీన్ గా ఆమె పని చేస్తున్నారు. 2018లో డీన్ గా నియమితులైన క్లాడిన్.. కరోనా కష్టకాలంలోనూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. హార్వర్డ్ ప్రెసిడెంట్ గా తనను ఎంపిక చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

వర్సిటీ అకడమిక్ ఎక్సలెన్స్ ను నిలబెట్టడానికి, మెరుగుపరచాలనే అంకితభావం క్లాడిన్ కు ఉన్నాయని హార్వర్డ్ ప్రెసిడెన్షియల్ సెర్చ్ కమిటీ చైర్మన్ పెన్నీ ప్రిట్ట్ కర్ తెలిపారు.