Philippine magazine’s oldest model : ఫిలిప్పీన్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై అతి పెద్ద వయసున్న మోడల్.. ఆమె వయసు జస్ట్..

పచ్చబొట్లు సంప్రదాయంగా వేసుకుంటారు. కొందరు ఫ్యాషన్ కోసం వేసుకుంటారు. అలా తన తెగలో ఎంతో ప్రసిద్ధి చెందిన టాటూ కళను నేర్చుకోవడమే కాదు 106 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చింది అపో వాంగ్ ఓడ్ అనే మహిళ. ఆమెకు సంబంధించిన ఆసక్తికరమైన కథనంతోపాటు ఆమె ముఖచిత్రంతో ఏప్రిల్ నెల సంచికను ప్రచురించింది వోగ్ ఫిలిప్పీన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్. దీంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన మోడల్‌గా వాంగ్ ఓడ్ పేరు మారుమోగుతోంది.

Philippine magazine’s oldest model : ఫిలిప్పీన్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై అతి పెద్ద వయసున్న మోడల్.. ఆమె వయసు జస్ట్..

Philippine magazine's oldest model

Philippine magazine’s oldest model :  పచ్చబొట్టు (tattoos) అనగానే పచ్చబొట్టు చెరిగిపోదులే అనే సినిమా పాట గుర్తొస్తుంది. కొందరు సంప్రదాయం ప్రకారం పచ్చబొట్లు వేసుకునే వారుంటారట. కొందరు తాము అమితంగా ఇష్టపడే వ్యక్తులు, కుటుంబసభ్యులు పేర్లు కూడా పచ్చబొట్లుగా వేయించుకుంటారు. ఈ మధ్యకాలంలో టాటూలు వేయించుకోవడం మరింత ఫ్యాషన్‌గా మారింది. విషయానికొస్తే 106 ఏళ్ల బామ్మ ఏప్రిల్ నెల “వోగ్ ఫిలిప్పీన్స్” (vogue philippines) ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీ కెక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద వయసున్న మోడల్‌గా ఈ ఘనత సాధించింది. ఇంతకీ ఈమె ఏం చేసింది? అంటే…

first plant fungus case : కోల్‌కతాలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాణంతక “ప్లాంట్ ఫంగస్” కేసు.. ఇది ఎలా సంక్రమిస్తుందంటే …

అపో వాంగ్ ఓడ్ కి (Apo Whang-Od ) 106 ఏళ్లు. కళింగ (Kalinga) తెగకు చెందిన ఈమె సంతతి వారంతా ఫ్రావిన్స్ (Kalinga province) లోని మనీలా (Manila) ప్రాంతానికి దగ్గరలోని బుస్కలన్ (Buscalan) అనే పర్వత ప్రాంతాల్లో నివాసం ఉండేవారు. “మంబబాటోక్” (mambabatok) గా చెప్పబడే టాటూ కళను వాంగ్ ఓడ్ చిన్నతనం నుంచి తన తండ్రి వద్ద నేర్చుకుంది. చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి ఆమె తమ సంప్రదాయానికి చెందిన, పూర్వీకుల చిహ్నాలను పచ్చబొట్లు వేస్తూ ఉండేదట. ఆ సమయంలోనే మొట్టమొదట టాటూలు వేసే వ్యక్తిగా ఆమెకు గుర్తింపు దక్కిందట.

World Heaviest Bicycle : ప్రపంచంలోనే బరువైన సైకిల్ .. ముందుకెళ్లాలంటే 35 గేర్లు, వెనక్కెళ్లాలంటే 7 గేర్లు మార్చాల్సిందే..

కొన్ని సంవత్సరాలుగా వాంగ్ ఓడ్ టాటూస్ వేస్తూనే వచ్చింది. తాను చేసే పనికి ఎప్పటికీ రిటైర్మెంట్ లేదని ఆమె చెబుతూ ఉంటుంది. ఇప్పటికీ తన గురించి తెలుసుకునేందుకు దూర ప్రాంతాలనుంచి కలవడానికి ఎంతోమంది వస్తుంటారని వారిని అలా కలవడం ఎంతో సంతోషంగా అంటుంది. మంబబాటోక్ ఆర్ట్‌ను కేవలం ఆమె వంశీయులకు మాత్రమే అందిస్తారట. తనతోపాటు ఈ కళ అంతరించిపోకూడదనే ఉద్దేశంతో వాంగ్ ఓడ్ తమ సంతతికి చెందిన ఎలియాంగ్ విగాన్ (Elyang Wigan), గ్రేస్ పాలికాస్ లకు (Grace Palicas) శిక్షణ ఇచ్చిందట. తాను లేకపోయినా ఈ కళను బతికించే బాధ్యత వారికి అప్పగించినట్లు ఆమె చెబుతుంది.

UK pour Moi :  భారతీయ మహిళలే ప్రపంచంలో అత్యంత అందమైనవారట .. అధ్యయనంలో వెల్లడి

ఇలా వాంగ్ ఓడ్‌కి సంబంధించిన విషయాలు, ఆమె సాధించిన విజయాలు, టాటూల చరిత్ర, ఆమె ఆరోగ్య రహస్యాలను తెలియజేస్తూ వోగ్ ఫిలిప్పీన్స్ మ్యాగజైన్ ఏప్రిల్ నెల సంచికను ప్రచురించింది. ఏంతో ఆసక్తిని రేపుతున్న వాంగ్ ఓడ్ జీవిత చరిత్ర తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారట. ఈ సంచిక మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతోందని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Vogue Philippines (@voguephilippines)