Visa Applicants Interview : విదేశీ ప్రయాణికులకు అమెరికా గుడ్ న్యూస్.. వీసా దరఖాస్తుదారులకు మరో ఏడాది ఇంటర్వ్యూ మినహాయింపు

విదేశీ ప్రయాణికులకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారులకు మరో ఏడాది పాటు ఇంటర్వ్యూ మినహాయింపు ఇచ్చింది. భారత్ తోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వివిధ వృత్తి నిపుణులకు ఈ అవకాశం కల్పించింది.

Visa Applicants Interview : విదేశీ ప్రయాణికులకు అమెరికా గుడ్ న్యూస్.. వీసా దరఖాస్తుదారులకు మరో ఏడాది ఇంటర్వ్యూ మినహాయింపు

US VISA

Updated On : December 25, 2022 / 8:59 AM IST

Visa Applicants Interview : విదేశీ ప్రయాణికులకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారులకు మరో ఏడాది పాటు ఇంటర్వ్యూ మినహాయింపు ఇచ్చింది. భారత్ తోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వివిధ వృత్తి నిపుణులకు ఈ అవకాశం కల్పించింది. అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు సహా వలసేతర వీసా దరఖాస్తుదారులకు కల్పించిన ఇంటర్వ్యూ మినహాయింపు సదుపాయాన్ని వచ్చే ఏదాడి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

తాత్కాలిక వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులు (హెచ్-2 వీసాలు), విద్యార్థులు (ఎఫ్,ఎం వీసాలు), అకడమిక్ ఎక్సేంజ్ విజిటర్ల (అకడమిక్ జే వీసాలు) కేటగిరీల వారు వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపు సదుపాయం పొందేందుకు అర్హులని వెల్లడించింది.

US Visas : రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు

స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ (హెచ్-1బీ), ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ విజిటర్ (హెచ్-3 వీసాలు), ఇంట్రాకంపెనీ ట్రాన్స్ ఫరీలు (ఎల్ వీసాలు), అసాధారణ ప్రతిభావంతులు (ఓ వీసాలు), క్రీడాకారులు, ఎంటర్ టైనర్లు (పీ వీసాలు), అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనే వారు (క్యూ వీసాలు), క్వాలిఫయింగ్ డెరివేటివ్ కేటగిరీల్లో నాన్-ఇమ్మిగ్రెంట్ తాత్కాలిక వర్క్ వీసాలకు ఆమోదించిన కొన్ని రకాల వ్యక్తిగత పిటిషన్ల లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.