Woman Salary : ఆమె జీతం గంటకు రూ.54 లక్షలు

ఓ మహిళ జీతం గంటకు రూ.54 లక్షలు.. రోజుకు రూ.13 కోట్లు.. ఏడాదికి 4వేల కోట్లు.. 53 ఏళ్ల డెనిస్‌ కొయెత్స్‌ అనే మహిళ లండన్ లో ఉంటోంది.

Woman Salary : ఆమె జీతం గంటకు రూ.54 లక్షలు

The Womans Salary Is Rs 54 Lakh Per Hour

Updated On : April 12, 2021 / 10:59 AM IST

The woman’s salary is Rs 54 lakh per hour : ఓ మహిళ జీతం గంటకు రూ.54 లక్షలు.. రోజుకు రూ.13 కోట్లు.. ఏడాదికి 4వేల కోట్లు.. 53 ఏళ్ల డెనిస్‌ కొయెత్స్‌ అనే మహిళ లండన్ లో ఉంటోంది. ఆన్‌లైన్‌ జూదానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బెట్‌ 365 కంపెనీకి ఆమెనె బాస్‌. మొన్నటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణా ఆమెకు అందేది 469 మిలియన్‌ పౌండ్లు.

ఇందులో వేతనం 421 మిలియన్‌ పౌండ్లతోపాటు, కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్‌ కింద మరో 48 మిలియన్‌ పౌండ్లు అదనం. అంటే ఈ రెండూ కలిపితే ఆరోజు నాటి పౌండుతో రూపాయి విలువ ప్రకారం దాదాపు 4742,59,83,500 కోట్లు!! అందుకే ఇది యూకే చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతనంగా రికార్డు సృష్టించింది.

ఇంకా చెప్పాలంటే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వార్షిక వేతనం కంటే సుమారు 2,360 రెట్లు డెనిస్‌ సొంతమైంది. అలాగే బ్రిటన్‌లోని 100 పెద్ద కంపెనీల సీవోల వార్షిక వేతనం కలిపినా అంతకంటే ఎక్కువే.

కాగా 2016తో పోలిస్తే డెనిస్‌ వార్షిక వేతనంలో పెరుగుదల 45శాతం అధికంగా నమోదైంది. అలాగే ఈ నాలుగేళ్లలో డెనిస్‌ మొత్తం ఆస్తి 1.3 బిలియన్‌ పౌండ్లకు చేరి, బ్రిటన్‌లోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఐదో స్థానం పొందింది.