పైలట్లకు DGCA స్ట్రిక్ రూల్స్: ఇకపై ‘బోయింగ్’ విమానం నడపాలంటే?

విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గాల్లోకి ఎగిరిన విమానం సేప్టీగా ల్యాండ్ అవుతున్న గ్యారెంటీ లేదు. ఎక్కడ కూలిపోతుందోనని బోయింగ్ విమానం ఎక్కిన ప్రయాణికులు భయంతో వణికిపోతున్న పరిస్థితి.

  • Published By: sreehari ,Published On : March 12, 2019 / 10:12 AM IST
పైలట్లకు DGCA స్ట్రిక్ రూల్స్: ఇకపై ‘బోయింగ్’ విమానం నడపాలంటే?

Updated On : March 12, 2019 / 10:12 AM IST

విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గాల్లోకి ఎగిరిన విమానం సేప్టీగా ల్యాండ్ అవుతున్న గ్యారెంటీ లేదు. ఎక్కడ కూలిపోతుందోనని బోయింగ్ విమానం ఎక్కిన ప్రయాణికులు భయంతో వణికిపోతున్న పరిస్థితి.

విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గాల్లోకి ఎగిరిన విమానం సేప్టీగా ల్యాండ్ అవుతున్న గ్యారెంటీ లేదు. ఎక్కడ కూలిపోతుందోనని బోయింగ్ విమానం ఎక్కిన ప్రయాణికులు భయంతో వణికిపోతున్న పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో విమానం ఎక్కితే.. ఇంటికి క్షేమంగా తిరిగి వస్తామా లేదా అనే భయం ప్రతి ప్రయాణికుడిలో కనిపిస్తోంది. వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికులు భయంతో బెదిరిపోతున్నారు. విమాన ప్రయాణం అంటేనే.. అమ్మ బాబోయ్.. గాల్లోనే ప్రాణాలు పోవాల్సిందేనని గజగజ వణికిపోతున్నారు. ఎందుకు ఇలా విమానంలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. విమాన ప్రమాదాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
Read Also : వాట్సాప్‌లో కొత్త బగ్ : యూజర్ల ఫొటోలు డిలీట్ చేస్తోంది

ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే రాడర్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయి కుప్పకూలిపోతున్నాయి. విమానంలో ప్రయాణించే వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఇథోపియన్ ఎయిర్ లైన్ విమాన ప్రమాదమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త రూల్స్ జారీ చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్నిమార్గదర్శకాలను విడుదల చేసింది. 

పైలట్ కు 1000.. కో పైలట్ కు 500 అవర్స్
ప్రత్యేకించి.. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలకు ఈ రూల్స్ ను వర్తింపజేసింది.  బోయింగ్ విమానాలను నడిపే పైలట్లకు ఈ రూల్స్ వర్తిస్తాయి. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను నడపాలంటే.. మెయిన్ పైలట్ కు కనీసం వెయ్యి గంటల ఫ్లయింగ్ అనుభవం ఉండాలి. కో పైలట్ కు మాత్రం 500 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉండాలి. ‘B737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేట్ చేసే విమాన సిబ్బంది PIC (పైలట్- ఇన్- కమాండ్) 1 వెయ్యి గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉండి ఉండాలి. బోయింగ్ 737 NG విమానాలను నడిపే కో పైలట్ కు 500 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉండాలి’ అని రెగ్యులేటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇథోపియా బోయింగ్ విమానం ప్రమాద ఘటనతో DGCA రెగ్యులేటరీ ఈ కొత్త రూల్స్ ను అమల్లోకి తెచ్చింది. ఇథోపియా విమానం కుప్పకూలిన ఘటనలో 157 మంది ప్రయాణికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. 

ఐదు నెలల్లో రెండో ప్రమాదం..
ఐదునెలల్లో విమాన ప్రమాదం జరగడం ఇది రెండోసారి. 2018 అక్టోబర్ నెలలో లయన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండోనేషియాలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసందే. ఈ ప్రమాదంలో 180 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. మన భారత్ లో స్పైస్ జెట్ జెట్ ఎయిర్ వేస్ సంస్థలు బోయింగ్ తరహా విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి. ఈ రెండు ఎయిర్ లైన్ సంస్థలకు డీజీసీఏ మార్గదర్శకాలను జారీ చేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను ఆపరేట్ చేసే ఎయిర్ లైన్స్ సంస్థలు తప్పనిరిగా ఇంజినీరింగ్, నిర్వహణ సిబ్బంది అంతా తమ మార్గదర్శకాలకు లోబడి ఉండాలని ఆదేశించింది.

బ్రేక్ చేస్తే.. కఠిన చర్యలు..
కొత్త రూల్స్ కు అనుగుణంగా ఆపరేటర్లు విమానాలను ఆపరేట్ చేయాల్సిందిగా సూచించింది. మార్చి 12 నుంచి 1200 గంటల ఫ్లయింగ్ ఎక్స్ పీరియన్స్ రూల్స్ అమల్లోకి వస్తాయని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. రూల్స్ ను అతిక్రమించి ఎయిర్ లైన్స్ విమానాలను ఆపరేట్ చేసినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. దీనిపై డీజీసీసీ మానిటరింగ్ విభాగం ఎప్పటికప్పడూ పర్యవేక్షిస్తుంటూనే ఉంటుందని తెలిపింది.  Read Also : హిస్టరీలో మిస్టరీ : 5వేల ఏళ్ల నాటి అస్థిపంజరం.. ఎవరిదంటే?