కుర్రాడి చెవిలో దూరిన సాలీడు.. ఎలా గూడు కట్టేస్తుందో చూడండి!

అతడి పేరు లి.. 20 ఏళ్లు ఉంటాయి. చైనాకు చెందిన ఈ కుర్రాడు ఎప్పటిలానే ఆ రోజు నిద్రపోయాడు. రాత్రి సమయంలో ఓ చిన్న సాలీడు మెల్లగా అతడి చెవిలో దూరింది

  • Published By: sreehari ,Published On : May 11, 2019 / 01:30 PM IST
కుర్రాడి చెవిలో దూరిన సాలీడు.. ఎలా గూడు కట్టేస్తుందో చూడండి!

Updated On : May 11, 2019 / 1:30 PM IST

అతడి పేరు లి.. 20 ఏళ్లు ఉంటాయి. చైనాకు చెందిన ఈ కుర్రాడు ఎప్పటిలానే ఆ రోజు నిద్రపోయాడు. రాత్రి సమయంలో ఓ చిన్న సాలీడు మెల్లగా అతడి
చెవిలో దూరింది

అతడి పేరు లి.. 20 ఏళ్లు ఉంటాయి. చైనాకు చెందిన ఈ కుర్రాడు ఎప్పటిలానే ఆ రోజు నిద్రపోయాడు. రాత్రి సమయంలో ఓ చిన్న సాలీడు మెల్లగా అతడి చెవిలో దూరింది. అది గమనించలేదు. ఉదయం లేవగానే చెవిలో అసౌకర్యంగా అనిపించింది. పదే పదే దురదపెట్టడంతో భరించలేకపోయాడు. చివరికి ఓ ENT ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ ను కలిశాడు.

వైద్యులు అతన్ని పరీక్షించగా.. లి.. చెవిలో సాలీడు ఉన్నట్టు నిర్ధారించారు. అంతేకాదు.. చెవిలో దూరిన సాలీడు.. సాలెగూడు కడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. స్థానిక నివేదిక ప్రకారం.. లి అనే కుర్రాడు యంగ్జూ యూనివర్శిటీ మెడికల్ స్కూల్లోని ఓ ఈఎన్టీ స్పెషలిస్టును కలిశాడు. చెవిలో దురదతో బాధపడుతున్నట్టు చెప్పాడు. 

మైక్రోస్కోప్ ద్వారా చెవిని పరీక్షించారు. యువకుడి చెవిలో గ్రే స్పైడర్ కదులుతున్నట్టుగా నిర్ధారించారు. సరైన సమయంలో వైద్యులు అతడి చెవిలోని సాలీడుని బయటకు తీయడంతో ఎలాంటి గాయాలు కాలేదు. లి చెవిలోకి సెలైన్ సొల్యుషన్ ఇంజెక్ట్ చేయడంతో.. సాలీడు బయటకు వచ్చేసింది.

అప్పటివరకూ దురదతో బాధపడిన యువకుడు.. సాలీడు బయటకు రావడంతో ఊపిరిపీల్చుకున్నాడు. చెవిలోని సాలీడును వైద్యులు బయటకు తీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..