England : వేలంలో రూ.84 లక్షలు పలికిన టైటానిక్ షిప్ డిన్నర్ మెనూ

ఏప్రిల్ 14, 1912 న టైటానిక్ షిప్ మునిగిపోయింది. అయితే అది మునిగిపోవడానికి మూడు రోజుల ముందు అందించిన డిన్నర్ మెనూని ఇటీవల వేలం వేశారు. వేలంలో ఎన్ని లక్షలు పలికిందో తెలుసా?

England : వేలంలో రూ.84 లక్షలు పలికిన టైటానిక్ షిప్ డిన్నర్ మెనూ

England

Updated On : November 12, 2023 / 3:08 PM IST

England : టైటానిక్ షిప్ ఫస్ట్ క్లాస్ డిన్నర్ మెనూని ఇటీవల ఇంగ్లాండ్‌లో వేలం వేశారు. షిప్ మునిగిపోవడానికి మూడు రోజుల ముందు ఈ మెనూ అందించినట్లు అందులోని తేదీలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ మెనూ వేలంలో 83 వేల పౌండ్లు  ( రూ.84.5 లక్షలు) ధర పలకడం విశేషం.

Titanic overcoat at auction : టైటానిక్ సినిమాలో కేట్ విన్స్‌లెట్ వేసుకున్న ఓవర్ కోట్ వేలంలో ఎంత ధర పలుకుతోందో తెలుసా?

టైటానిక్ షిప్‌లో ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం ఇచ్చిన చివరి విందూ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 14, 1912 రాత్రి షిప్ మునిగిపోవడానికి ముందు అంటే కేవలం మూడు రోజుల ముందు ఈ మెనూను షిప్ సిబ్బంది అందించినట్లు మెనూను చూస్తే అర్ధమవుతోంది. మెనూను చూసిన తర్వాత లైఫ్ బోట్‌లకు తరలిస్తున్నప్పుడు ఈ మెనూను ఎవరు తీసుకున్నారు? విక్టోరియా ఫుడ్డింగ్ అంటే ఏంటి? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఆ సాయంత్రం ఆప్రికాట్లు, ఫ్రెంచ్ ఐస్ క్రీం పిండి మిశ్రమం, గుడ్లు, జామ్, బ్రాందీ, యాపిల్స్, చెర్రీస్, పీల్, చక్కెర మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమం ఉంది. మెనూ నీటితో తడిసినా వైట్ స్టార్ లోగోను కలిగి ఉంది. ఏప్రిల్ 11 న ఆస్టెర్స్, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాటు, చికెన్, బంగాళా దుంపలు, రైస్ మరియు పార్స్నిప్ పూరితో సహా పలు వంటకాల జాబితాను మెనూ చూపిస్తోంది.

US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్‌గార్డ్ పరిశోధన

ఈ చారిత్రాత్మకమైన మెనూ ఐర్లాండ్‌లోని క్వీన్స్ టౌన్ నుండి న్యూయార్క్‌కు బయలుదేరిన టైటానిక్ మర్నాడు అందించిన ఆహారాన్ని వివరిస్తుంది. దీనిని హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ ఆఫ్ విల్ట్ షైర్ వేలం వేస్తున్నారు.