Toddler fell from moving car : నడి రోడ్డుపై కారులో నుంచి పడిన చిన్నొడు..తర్వాత ఏమైంది ? వీడియో వైరల్

నడి రోడ్డుపై కారులో నుంచి ఓ బుడ్డొడు కింద పడిపోయాడు. అసలే రద్దీ రోడ్డుపై చిన్నొడ్డు బయటపడడంతో అందరూ షాక్ తిన్నారు.

Toddler fell from moving car : నడి రోడ్డుపై కారులో నుంచి పడిన చిన్నొడు..తర్వాత ఏమైంది ? వీడియో వైరల్

fell-from-moving-car

Updated On : March 17, 2021 / 6:36 PM IST

Toddler fell : నడి రోడ్డుపై కారులో నుంచి ఓ బుడ్డొడు కింద పడిపోయాడు. అసలే రద్దీ రోడ్డుపై చిన్నొడు బయటపడడంతో అందరూ షాక్ తిన్నారు. కానీ..అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. వెనుక నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లు అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కారులో నుంచి చిన్నారి పడిపోయాడనే విషయం తెలియక కారును ముందుకు పోనిచ్చారు. ట్రాఫిక్ లో కారు వెనుకాలే..పరుగెత్తుతున్న చిన్నారిని ఓ మహిళ పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎప్పుడు ? ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న సీసీటీవీ లో ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. తొలుత ఈ వీడియోను ద సన్ ప్రసారం చేయగా..Shirin Khan ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇలా కూడా జరుగుతుందా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. white SUV car లో నుంచి బాలుడు కింద పడగా..మహిళ..పరుగెత్తుకుంటూ వచ్చి..అతడిని ఎత్తుకొని వెళ్లింది. ఆ బాలుడికి ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.