Trump Tariff On India: ఇండియాకు ట్రంప్ షాక్.. భారత్ పై 25 శాతం సుంకాలు.. పైగా పెనాల్టీ
ఇండియా తన మిలటరీ ఎక్విప్ మెంట్ లో అత్యధిక భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి అత్యంత ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా, చైనా ఉన్నాయి.

Trump Tariff On India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇండియాపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ లో ప్రకటించారు. దీంతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై పెనాల్టీ కూడా విధించారు ట్రంప్.
‘ఇండియా అమెరికాకి చాలా కాలం నుంచి మంచి మిత్రుడే. ఆ దేశంతో చాలా తక్కువ బిజినెస్ చేశాం. ఎందుకంటే వారి టారిఫ్ లు చాలా ఎక్కువ. ఒక రకంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టారిఫ్ లు ఇండియా అమలు చేస్తుంది. అలాగే, ఇండియా తన మిలటరీ ఎక్విప్ మెంట్ లో అత్యధిక భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి అత్యంత ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా, చైనా ఉన్నాయి.
ఓ వైపు ప్రపంచం మొత్తం రష్యా.. యుక్రెయిన్ మీద యుద్ధం ఆపాలని చెబుతుంది. కానీ అంత మంచేం జరగడం లేదు. కాబట్టి ఇండియా మీద 25శాతం టారిఫ్ లు విధిస్తున్నాం. అలాగే, రష్యా నుంచి ఆయుధాలు, ఆయిల్ కొంటున్నందుకు పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ట్రంప్ ప్రకటించారు.