చైనాకు చిక్కులుతప్పవు.. అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని ట్రంప్ పరోక్ష హెచ్చరిక

చైనాకు చిక్కులుతప్పవు.. అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని ట్రంప్  పరోక్ష హెచ్చరిక

Updated On : April 15, 2020 / 5:06 AM IST

కరోనా మహమ్మారి గురించి కమ్యూనిస్ట్ దేశం దాచి ఉంచిన నిజాల కారణంగా అంతకంతే అనుభవించి తీరుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. గతేడాది వూహాన్ లో పుట్టిన వైరస్.. అంతర్జాతీయంగా ఎంత పెను బీభత్సం సృష్టిస్తుందో తెలిసిందే. లక్షా 22వేల 753మందిపై వైరస్ ప్రభావం కనపడింది. విశ్వవ్యాప్తంగా 2మిలియన్ మందిలో ఇన్ఫెక్షన్ కనిపించింది. వైట్ హౌజ్ లో జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్ పై ట్రంప్ ఫైర్ అయ్యారు. 

‘చైనాపై ఎటువంటి చర్యలు తీసుకోరా అని అడిగిన దానికి ఎవరు చెప్పారు ఎటువంటి చర్యలు తీసుకోమని అంటూ ట్రంప్ ఫైర్ అయ్యారు. అవేం నేను చెప్పను. చైనా తప్పకుండా తెలుసుకుంటుంది. నేనెందుకు చెప్పాలి. వారు ఇచ్చిన తప్పుడు సమాచారానికి తప్పక అనుభవించాలి’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపోర్టర్ ను టార్గెట్ చేస్తూ.. మేమేం చేస్తున్నామో మీకు తెలియాలా.. ఓ పేపర్ మీద మా ప్లాన్ ఏంటో రాసి ఏం చేయాలనుకుంటున్నామో మీకు చెప్పం. మాకు అంత అవసరం లేదని అన్నారు. 

అమెరికాను కాపాడుకోవడంలో మా టీంతో పాటు నాకూ, ఓ ప్లానింగ్ ఉంది. అగ్రస్థాయి నిపుణులతో ప్లాన్ ప్రకారమే నడుచుకుంటున్నాం. అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తున్నాం. అదే చాలా ముఖ్యం కూడా అని మీడియా సమావేశంలో తెలియజేశారు ట్రంప్. 

సెనేటర్ స్టీవ్ డైనిస్ ట్రంప్ కు లెటర్ ద్వారా ప్రశ్నించారు. చైనా నుంచి మెడికల్ సప్లై, పరికరాలను మళ్లీ తీసుకురావాలని.. డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కోరారు. ‘కొవిడ్-19 మహమ్మారి చైనా నుంచి మెడిసిన్, అత్యవసరమైన మెడికల్ పరికరాలు అమెరికాకు ఎంత కావాలో తెలియజేసిందని పేర్కొన్నారు. సెనేటర్ల గ్రూప్ మరో లెటర్లో స్టేట్ సెక్రటరీ మైక్ పోంపియోను ప్రశ్నించారు.