మిసైల్స్ మీట్ : షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ట్రంప్-కిమ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 27, 2019 / 12:29 PM IST
మిసైల్స్ మీట్ : షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ట్రంప్-కిమ్

Updated On : February 27, 2019 / 12:29 PM IST

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భేటీ అయ్యారు. వియత్నాం రాజధాని హనోయిలోని మెట్రోపాల్ హోటల్ వేదికగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇద్దరు దేశాధినేతలకు వెల్ కమ్ చెప్పేందుకు హోటల్ దగ్గరకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.హోటల్ దగ్గర భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కిమ్ ను కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. అన్ని అడ్డంకులను అధిగమించేందుకే తాము వియత్నాంలో మీట్ అయినట్లు కిమ్ తెలిపారు.
Also Read:క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే..

రెండు దేశాల జాతీయ జెండాల ముందు నిలబడి ఇద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.కిమ్ ను కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.రెండు రోజుల పాటు వీరి భేటీ జరుగనుంది. హోటల్ లో వీరి కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ భేటీ కోసం ఉత్తరకొరియా నుంచి చైనా మీదుగా వియత్నాంకి రైలులో వచ్చారు కిమ్ జోంగ్ ఉన్. కిమ్ తో భేటీ కోసం మంగళవారం(ఫిబ్రవరి26,2019) రాత్రి ట్రంప్ వియత్నాం చేరుకున్నారు.
Also Read:పాక్ వైఖరి మార్చుకోవాల్సిందే : రష్యా, చైనా

సింగపూర్ లో 2018లో ట్రంప్-కిమ్ మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య అణు నిరాయుధీకరణపై ఒప్పందం జరిగినా విధివిధానాలేమీ స్పష్టంగా ఖరారు కాలేదు. మరోసారి ఇద్దరి దేశాధినేతల సమావేశానికి వియత్నాం వేదిక అవడం విశేషం.ఉత్తరకొరియాకు-అమెరికా రెండింటితోనూ వియత్నాంకు దౌత్యపరంగా మంచి సంబంధాలున్నాయి. అమెరికా-వియత్నాంల మధ్య గతంలో యుద్ధం జరిగినప్పటికీ ప్రస్తుతం మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. పైగా శత్రుత్వం వీడడం వల్ల కలిగిన ఫలితాలకు ఉదాహరణగా వియత్నాంను ఉత్తరకొరియాకు చూపించడానికి అమెరికా ఈ దేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:పాక్ కూల్చిన భారత యుద్ధ విమానాలు ఇవే