Twitter Killer‌కు మరణశిక్ష

Twitter Killer‌కు మరణశిక్ష

Updated On : December 16, 2020 / 3:36 PM IST

Twitter killer’ sentenced to death : Twitter Killer‌కు మరణశిక్ష పడింది. అత్యంత దారుణంగా చంపేస్తున్న ఈ రాక్షసుడిపై కోర్టు సంచలన తీర్పును వెలువరిచింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అతడికి తాజాగా మరణశిక్ష విధించింది. ఈ ఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. టికాహిరో షిరాహిషిలో అనే వ్యక్తి టోక్యోకు సమీపంలోని జామా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవాడు. 2017 సంవత్సరంలో హాలోవీన్ డే సందర్భంగా పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు.

అక్కడి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. కూలర్లు, టూల్ బ్యాక్స్‌ల నిండా మృతదేహాలు కనిపించాయి. చేతులు, కాళ్లు అవయవాలు విడివిడిగా కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.అప్పట్లో సంచలనం సృష్టించింది. హతులైన వారిలో ఎనిమిది మంది అమ్మాయిలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరందరూ 26 ఏళ్లలోపు వారే.

ట్విట్టర్ ద్వారా పరిచయం చేసుకొనేవాడు. ఆత్మహత్య ఆలోచనలున్న వారిని ఇంటికి రప్పించుకొనేవాడు. ఎలా ఆత్మహత్యలు చేసుకోవాలనే దానిపై చర్చిద్దామనే వాడు. అనంతరం వారు ఇంటికి వచ్చిన తర్వాత..అత్యాచారం చేసి దారుణంగా చంపేసేవాడని పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. తాను హత్యలు చేసినట్లు అంగీకరించడంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.