హ్యాట్సాఫ్, కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు హనిమూన్ వాయిదా వేసుకున్న డాక్టర్ జంట

వారిద్దరూ డాక్టర్లు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. హనిమూన్ ప్లాన్ కూడా చేసుకున్నారు. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. అంతే, వారికి తమ విధి నిర్వహణ

  • Published By: veegamteam ,Published On : April 4, 2020 / 10:01 AM IST
హ్యాట్సాఫ్, కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు హనిమూన్ వాయిదా వేసుకున్న డాక్టర్ జంట

Updated On : April 4, 2020 / 10:01 AM IST

వారిద్దరూ డాక్టర్లు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. హనిమూన్ ప్లాన్ కూడా చేసుకున్నారు. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. అంతే, వారికి తమ విధి నిర్వహణ

వారిద్దరూ డాక్టర్లు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. హనిమూన్ ప్లాన్ కూడా చేసుకున్నారు. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. అంతే, వారికి తమ విధి నిర్వహణ గుర్తు వచ్చింది. కరోనా పేషెంట్లకు చికిత్స అందించడమే ముఖ్యం అనుకున్నారు. అంతే.. మరో ఆలోచన చేయకుండా హనిమూన్ వాయిదా వేసుకున్నారు. విధుల్లో చేరిపోయారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనాపై పోరాటం చేసేందుకు హనిమూన్ కూడా వాయిదా వేసుకున్న ఆ డాక్టర్ జంటను అందరూ ప్రశంసిస్తున్నారు. డ్యూటీ ఫస్ట్ అన్న వారి డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు.(ఇటలీ వృధ్ధుల త్యాగానికి వెల కట్టలేము)

అతడి పేరు డాక్టర్ ఖాసిఫ్ చౌదరి. ఆమె పేరు నైలా షరీన్. ఆమె కూడా డాక్టరే. ఇటీవలే న్యూజెర్సీలో నిఖా(వివాహం) చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కాసేపు గడిపారు. హనిమూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అంతా రెడీ అవుతున్న సమయంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన వార్త వారి చెవిన పడింది. అంతే మరో ఆలోచన లేకుండా ఆ యువ జంట కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. హనిమూన్ ను వాయిదా వేసుకున్నారు.(కరోనా సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించాలా? వద్దా? సైన్స్ ఏం చెబుతోంది?)

షరీన్ ఇంటర్ మెడిసిన్ చీఫ్ గా చేస్తుంది. న్యూయార్క్ లో వివిధ ఆసుపత్రులకు తిరగాల్సి ఉంటుంది. ఇక ఖాసిఫ్ చౌదరి. ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ గా పని చేస్తాడు. సెడార్ ర్యాపిడ్స్ లని మెర్సీ మెడికల్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా సునామీ విరుచుకుపడటంతో ఇద్దరూ డ్యూటీలో జాయిన్ అయ్యారు. హనిమూన్ వాయిదా వేసుకోవడం కొంచెం బాధగానే ఉంది, కానీ, డ్యూటీ కన్నా ఏదీ ముఖ్యం కాదంటారు ఈ యువ డాక్టర్ జంట. కరోనాతో బాధ పడుతున్న వారికి చికిత్స చేయడం తమ తక్షణ కర్తవ్యం అంటున్నారు. డ్యూటీ ఫస్ట్ హనిమూన్ నెక్ట్స్ అంటూ యువ డాక్టర్ జంట తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యక్తిగత స్వార్థం లేకుండా వారు చేసిన త్యాగాన్ని అందరూ కీర్తిస్తున్నారు.